ఫ్యాన్స్ టేస్ట్ మారింది… కానీ డైరెక్టర్ ది..

కాలానికి అనుగుణంగా ప్రేక్షకులు తమ ఆలోచనలను మార్చుకుంటున్నారు. ఒకప్పుడు రొటీన్ కథలకు ఓటేసిన ఫ్యాన్స్.. ఇప్పుడు సరికొత్త స్టోరీల వైపు మొగ్గు చూపుతున్నారు. సినిమాలో కంటెంట్ ఉంటే చాలు.. అది బాక్స్ ఆఫీస్ హిట్ కావాల్సిందే. మూస కథలకు కాలం చెల్లింది. కొత్త తరహా స్క్రిప్ట్స్‌ను అభిమానులు ఆదరిస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌లో నమోదైన హిట్స్ వివరాలను ఒకసారి పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లం అవుతోంది. టాలీవుడ్‌లో ఇప్పటివరకు దాదాపు 92 సినిమాలకు పైగా రిలీజ్ అయ్యాయి. అందులో స్ట్రెయిట్ […]

ఫ్యాన్స్ టేస్ట్ మారింది... కానీ డైరెక్టర్ ది..
Follow us

|

Updated on: Sep 08, 2019 | 4:43 AM

కాలానికి అనుగుణంగా ప్రేక్షకులు తమ ఆలోచనలను మార్చుకుంటున్నారు. ఒకప్పుడు రొటీన్ కథలకు ఓటేసిన ఫ్యాన్స్.. ఇప్పుడు సరికొత్త స్టోరీల వైపు మొగ్గు చూపుతున్నారు. సినిమాలో కంటెంట్ ఉంటే చాలు.. అది బాక్స్ ఆఫీస్ హిట్ కావాల్సిందే. మూస కథలకు కాలం చెల్లింది. కొత్త తరహా స్క్రిప్ట్స్‌ను అభిమానులు ఆదరిస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌లో నమోదైన హిట్స్ వివరాలను ఒకసారి పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లం అవుతోంది.

టాలీవుడ్‌లో ఇప్పటివరకు దాదాపు 92 సినిమాలకు పైగా రిలీజ్ అయ్యాయి. అందులో స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇక వీటిల్లో 15 సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించడం గమనార్హం. ప్రేక్షకులు సినిమాలో కొత్తదనం ఆశిస్తుంటే.. డైరెక్టర్లు మాత్రం రొటీన్ పంథాను ఫాలో అవుతున్నారు. కొందరు కొత్త దర్శకులు వైవిధ్యమైన కథలతో అభిమానులను పలకరిస్తుంటే.. మరికొందరు ఓల్డ్ ఫార్ములాతో నాలుగు పాటలు, రెండు ఫైట్ సీన్లను ప్లాన్ చేస్తున్నారు.

దీని గురించి ఉదాహరణ చెప్పుకుంటే.. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ సినిమా కథ మామూలుదే అయినా.. పల్లెటూరు వాతావరణం.. పైగా కథనంలో కొత్తదనం వెరసి సినిమాను విజయవంతం చేశాయి. ఇక అలాంటి హిట్ చిత్రం తర్వాత 2019లో చెర్రీ ‘వినయ విధయ రామ’ సినిమాతో ఫ్యాన్స్‌ను పలకరించగా అది కాస్తా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ డిజాస్టర్‌గా నిలిచింది. దీనికి కారణం రొటీన్ ఫార్ములా.. హీరోహై ఎలివేషన్, నాలుగు పాటలు, రెండు ఫైట్లు తప్ప.. సినిమాలో సరైన కంటెంట్ ఉండదు. అందుకే ఈ సినిమా ఘోరంగా విఫలమయ్యింది. అయితే ఈ ఫెయిల్యూర్ క్రెడిట్‌ను డైరెక్టర్ మీదకు తోసేయడం కూడా కరెక్ట్ కాదులెండి.. హీరో హై ఎక్స్‌పటేషన్స్ వల్ల కొన్నిసార్లు వాళ్ళు కూడా విఫలమవ్వడం కామన్. ఈ కోవలోనే పెటా, మిస్టర్ మజ్ను, సీత, ఏబీసీడీ, ఎన్జీకే. అభినేత్రి 2, ఫలక్‌నుమా దాస్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

మరోవైపు హిట్ సినిమాల విషయానికి వస్తే… కొత్త కథలు, క్రియేటివ్ కాన్సెప్ట్స్‌కే ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. దానికి ఉదాహరణ ‘చిత్రలహరి’, ‘జెర్సీ’, ‘మహర్షి’, ‘మల్లేశం’ వంటి సినిమాలే. ఈ  సినిమాల్లో కథకు చాలా బలం ఉండగా.. నటీనటులు కూడా తమ ప్రాణం పెట్టి ఆయా పాత్రల్లో జీవించడంతో చిత్రాలు అద్భుత విజయాలను అందుకున్నాయి.

ఇక ఎప్పుడో 90వ దశకంలో తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన జేమ్స్‌బాండ్ తరహా సినిమాలు, థ్రిల్లర్ జోనర్స్ ఇప్పుడు మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పంధాలోనే అడివి శేష్ హీరోగా వచ్చిన ‘గూఢచారి’ చిన్న సినిమాగా విడుదలై.. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్‌ను రాబట్టింది. దీనితో పాటు రీసెంట్‌గా రిలీజైన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిన విషయమే.

ఎఫ్ 2, ఓ బేబీ, బ్రోచేవారెవరు రా, నిను వీడని నీడను నేనే సినిమాలు కొత్త కథనంతో అభిమానులను అలరించాయి. తాజాగా విడుదలైన ‘ఎవరు’, ‘రాక్షసుడు’ థ్రిల్లర్ జోనర్‌లో మంచి విజయాలు అందుకున్నాయి.  ఇలా కొత్త తరహా కథల వైపు ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో దర్శకులు యునిక్ స్క్రిప్ట్స్ మీద దృష్టి సారిస్తే అద్భుత విజయాలు అందుకోవడం ఖాయమే.