వేలానికి పాడైపోయిన వాహనాలు

వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన చెడిపోయిన.. తిరిగి వినియోగంలోకి రానటువంటి వాహనాలను ప్రభుత్వం ఈ నెల 20, 21 తేదీల్లో వేలం వేయనుంది...

వేలానికి పాడైపోయిన వాహనాలు
Follow us

|

Updated on: Aug 13, 2020 | 1:21 PM

ఏళ్ల తరబడి మూలుగుతున్న వాహనాలను వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో రెండు రకాలైన వాహనాలను గుర్తించారు వాటిలో కేవలం పాడైపోయిన వాహనాలను మాత్రమే వేలం వేయనున్నారు.

వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన చెడిపోయిన.. తిరిగి వినియోగంలోకి రానటువంటి వాహనాలను ప్రభుత్వం ఈ నెల 20, 21 తేదీల్లో వేలం వేయనుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల లేసింది. ఏ శాఖ వద్ద ఎన్ని పాడైపోయిన వాహనాలున్నాయన్న వివరాలను సాధారణ పరిపాలన శాఖ సేకరించింది.

ప్రభుత్వంలోని మొత్తం 706 వాహనాలుండగా, ఇందులో 684 పాడైపోయిన వాహనాలు కాగా, 22 మాత్రం పని కొచ్చే వాహనాలున్నాయి. పాడైన వాహనాలను స్థానిక మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు తనిఖీ నిర్వహించారు. ఆ తర్వాత వాటికి ఎంత విలువ కొట్టవచ్చో ఓ ఆఫ్‌సెట్‌ ప్రైస్‌ను నిర్ణయించారు.

ఈ మేరకు వాటిని వేలం వేయనున్నారు. వాస్తవానికి వివిధ శాఖల వద్ద పడి ఉన్న పాత వాహనాలను వేలం ద్వారా విక్రయించాలంటూ ఇటీవల జరిగిన కేబినేట్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. న్యాయ శాఖలోని జడ్జీలు, అధికారుల వద్ద ఉన్న పాత వాహనాలను ఇటీవలే ప్రభుత్వం వెనక్కి తెప్పించింది. ఆ వాహనాలను 20, 21 తేదీల్లో వేలం ద్వారా విక్రయించనుంది.