బ్రేకింగ్: హైదరాబాద్‌లో మరో దారుణం.. టెకీపై అత్యాచారం

షాద్‌నగర్‌లో యువ వైద్యురాలిపై హత్యాచారం ఘటన మరవరకముందే హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. నిజాంపేటలో ఓ అపార్ట్‌మెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై జయల్‌చంద్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. అపస్మారక స్థితిలో బాధితురాలు ఉండగా.. ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన అతడు.. ఆ తరువాత అక్కడి నుంచి పరారీ అయ్యాడు. సాయంత్రం బాధితురాలు సోదరి ఇంటికి రాగా.. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చూసి పోలీసులకు ఫిర్యాదు […]

బ్రేకింగ్: హైదరాబాద్‌లో మరో దారుణం.. టెకీపై అత్యాచారం
Follow us

| Edited By:

Updated on: Dec 01, 2019 | 11:40 AM

షాద్‌నగర్‌లో యువ వైద్యురాలిపై హత్యాచారం ఘటన మరవరకముందే హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. నిజాంపేటలో ఓ అపార్ట్‌మెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై జయల్‌చంద్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. అపస్మారక స్థితిలో బాధితురాలు ఉండగా.. ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన అతడు.. ఆ తరువాత అక్కడి నుంచి పరారీ అయ్యాడు. సాయంత్రం బాధితురాలు సోదరి ఇంటికి రాగా.. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మహిళలపై అత్యాచారం చేసే వారిని ఉరి తీయాలంటూ ఓ వైపు దేశవ్యాప్తంగా పలువురు డిమాండ్ వ్యక్తం చేస్తుండగా.. అలాంటి ఘటనలే జరుగుతూ ఉండటం అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది.