Breaking News
  • హైదరాబాద్‌: గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ దాష్టీకం. విద్యార్థిని నేలకేసి కొట్టిన ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం. ప్రిన్సిపాల్‌ను నిలదీసిన విద్యార్థి తల్లిదండ్రులు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండని దురుసుప్రవర్తన. ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణం కులంపేరుతో దూషిస్తూ.. చితకబాదుతున్నాడని కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు.
  • ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ. విచారణకు హాజరుకాని తెలంగాణ పీసీబీ అధికారులు . తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా . పర్యావరణ అనుమతుల విషయంలో పీసీబీ అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న పిటిషనర్‌ హయాతుద్దీన్‌.
  • ఢిల్లీ: 2020-21 వార్షిక బడ్జెట్‌ ప్రతుల ముద్రణ ప్రారంభం. ఆర్థికశాఖ కార్యాలయం నార్త్‌బ్లాక్‌లో హల్వా వేడుక. బడ్జెట్‌ ప్రతుల ముద్రణ సందర్భంగా హల్వా వేడుక ఆనవాయితీ. హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థికశాఖ కార్యదర్శులు.
  • ప.గో: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని బీజేపీ నినాదం-మాణిక్యాలరావు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి టీడీపీ మాట్లాడుతోంది. ఐదు కోట్ల ఆంధ్రుల తరపున బీజేపీ-జనసేన పోరాడుతుంది. రాష్ట్రంలో జగన్ పాలన తుగ్లక్ పాలనను గుర్తుచేస్తోంది-మాణిక్యాలరావు.
  • సిద్దిపేట: గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారం. ఈ ఎన్నికల్లో ఉత్తమ్‌ మాటలన్నీ ఉత్తర ప్రగల్బాలే అని తేలిపోనుంది. 2 వేల వార్డులు గెలుస్తామంటున్న బీజేపీకి.. గజ్వేల్‌లోని 20 వార్డుల్లో ఏ ఒక్క వార్డు గెలవలేరు-హరీష్‌రావు. 20 వార్డులను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి-హరీష్‌రావు.

రాఫేల్‌ విమానాల డేటా చోరీ..? పారిస్‌లో ఏం జరిగింది..?

Attempted Break-In At IAF's Paris Office Handling Rafale Jets, రాఫేల్‌ విమానాల డేటా చోరీ..? పారిస్‌లో ఏం జరిగింది..?

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాఫేల్ వివాదం… ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో.. పారిస్‌లో తాజాగా జరిగిన ఘటన భారత వైమానిక దళాన్ని షాక్‌కి గురిచేసింది. పారిస్ శివారులో రాఫేల్ విమానాల తయారీని పర్యవేక్షిస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీం కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తులు చొచ్చుకు రావడానికి యత్నించారు. ఈ ఘటన ఈ నెల 19న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని రాఫేల్ విమాన తయారీ సంస్థ డసాల్ట్ కంపెనీ.. ఓ జాతీయ ఛానెల్‌కు వెల్లడించింది.‌ రాఫేల్ విమానాలకు సంబంధించిన డేటాను దొంగిలించడానికే దుండగులు యత్నించారా.. లేక ఇది గూఢచర్యమా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని ఆ సంస్థ పేర్కొంది. ఏమైనా ఇ ఉదంతం భారత వైమానిక దళాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

ఐఏఎఫ్‌కు చెందిన క్యాప్ట‌న్ ర్యాంక్ అధికారే పారిస్‌లో బృందానికి అధిప‌తిగా ఉన్నారు. ర‌క్ష‌ణ‌శాఖ‌, భార‌త వైమానిక ద‌ళం, ఫ్రెంచ్ ఎంబ‌సీ దీనిపై ఇంత వ‌ర‌కు స్పందించ‌లేదు. రాఫేల్ యుద్ధ విమానం అణు సామ‌ర్థ్యం క‌లిగిన‌ది. అయితే ఎవ‌రైనా సాంకేతిక స‌మాచారం చోరీ చేస్తే, అది ప్ర‌మాద‌క‌రంగా మారే అవ‌కాశం ఉంద‌ని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

కాగా, రాఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందం ఇండియాలో రాజకీయంగా పెను దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వివాదం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ సుప్రీం మెట్లెక్కగా.. కోర్టు మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది.