మెక్సికోలో దారుణం.. కల్తీ మద్యం తాగి 18 మంది మృతి..

ఇప్పటికే ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో మెక్సికోలో మరో విషాదం చోటుచేసుకుంది. హిల్స్‌ ప్రాంతంలోని ట్లాపా డి కామన్ ఫోర్ట్‌ ప్రాంతంలో కల్తీ మద్యం సేవించి 18 మంది ప్రాణాలు కోల్పోయారు.

మెక్సికోలో దారుణం.. కల్తీ మద్యం తాగి 18 మంది మృతి..
Follow us

| Edited By:

Updated on: Jun 09, 2020 | 8:08 PM

ఇప్పటికే ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో మెక్సికోలో మరో విషాదం చోటుచేసుకుంది. హిల్స్‌ ప్రాంతంలోని ట్లాపా డి కామన్ ఫోర్ట్‌ ప్రాంతంలో కల్తీ మద్యం సేవించి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు మరో 16 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందర్నీ స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. సంఘటన జరిగింది చిన్న గ్రామీణ ప్రాంతంలో అని.. ఇక్కడి రైతులంతా కల్తీ మద్యం సేవించడంతో ప్రాణాలు కోల్పోయారని మెక్సికో అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలోని సదరు మద్యం విక్రయించిన స్టోర్‌ నుంచి పెద్ద ఎత్తున మద్యం బాటిళ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. గత కొద్ది రోజులుగా లాక్‌డౌన్ కొనసాగుతున్న క్రమంలో మద్యం సేల్స్‌పై నిషేధం విధించారు. అయితే ఈ క్రమంలో కల్తీ మద్యం రెడీ చేస్తూ.. దొంగచాటుగా సేల్స్ చేపట్టారు కొందరు. ఈ క్రమంలోనే ఈ సంఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు.