పరుగులో ఓడాడు.. కోట్లాది జనహృదయాల్లో గెలిచాడు

ఆటలన్నాక గెలుపోటములు ఉంటాయి.. గెలిచినవాడే మొనగాడు కాదు.. అప్పుడప్పుడు క్రీడాస్ఫూర్తిని కనబర్చిన ఓడినవాడు గెలిచినవాడికంటే గొప్పవాడవుతాడు! లక్షలాది మంది హృదయాలను గెల్చుకుంటాడు..

పరుగులో ఓడాడు.. కోట్లాది జనహృదయాల్లో గెలిచాడు
Follow us

|

Updated on: Sep 22, 2020 | 11:35 AM

ఆటలన్నాక గెలుపోటములు ఉంటాయి.. గెలిచినవాడే మొనగాడు కాదు.. అప్పుడప్పుడు క్రీడాస్ఫూర్తిని కనబర్చిన ఓడినవాడు గెలిచినవాడికంటే గొప్పవాడవుతాడు! లక్షలాది మంది హృదయాలను గెల్చుకుంటాడు.. డియాగో మెట్రిగో కూడా అంతే.. ఓడి గెలిచాడు.. విషయమేమిటంటే స్పెయిన్‌లోని బార్సిలోనాలో ట్రయథ్లాన్‌ పోటీ జరుగుతోంది. ట్రయథ్లాన్ అంటే మూడు అథ్లెట్ అంశాలలో పాల్గొనడం.. ఇందులో భాగంగా పరుగుపందెం జరుగుతోంది.. స్పెయిన్‌కు చెందిన డియాగో మెట్రిగో గెలుపు తీరాలను చేరాలనే తపనతో పరుగు తీస్తున్నాడు.. తన కంటే ముందు పరుగెడుతున్న బ్రిటిష్‌ అథ్లెట్‌ జేమ్స్‌ టియాగిల్‌ను వెనక్కి నెట్టేయాలన్న పట్టుదలతో పరుగెడుతున్నాడు.. ఇంకొన్ని క్షణాల్లో విక్టరీ లైన్‌ క్రాస్‌ అవుతాడు.. మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకం గెల్చుకుంటాడు.. కానీ ఆ సమయంలోనే మెట్రిగో ఉదాత్తమైన క్రీడా స్ఫూర్తిని కనబరిచాడు. జేమ్స్‌ టియాగిల్‌ చివరి క్షణాల్లో ట్రాక్‌ తప్పడాన్ని గమనించాడు.. వెనక్కి తిరిగి చూశాడు.. అతడిలో రెప్పపాటు క్షణంలో విక్టరీ మిస్సయ్యిందేనన్న నిరాశ కనిపించింది.. మెట్రిటో ముగింపు రేఖ దగ్గరకు చేరుకున్నా.. దాటకుండా నిల్చుండి పోయాడు. కారణం ఆ విజయం సాధించే అర్హత టియాగిల్‌కు ఉందని భావించడమే! తనకంటే ముందుస్థానంలో నిలిచేందుకు అర్హుడైన జేమ్స్‌నే ముందు గీతదాటేలా చూశాడు. మెట్రిగో స్ఫూర్తికి ఆశేష ప్రేక్షకులు విస్మయం చెందారు.. మెచ్చుకోలుగా చప్పట్లు కొట్టారు.. టియాగిల్‌కు కూడా చెమ్మగిల్లిన కళ్లతో మెట్రిగోకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆఖరి క్షణం వరకు టియాగిల్‌ తనకంటే ముందే ఉన్నాడని, గెలవడానికి అతడే అన్ని విధాల అర్హుడని మెట్రిగో చెప్పడం కూడా చాలా మందికి నచ్చింది.. ఆ పరుగు సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.. ఆ వీడియోను ఇప్పటికే సుమారు కోటిమంది చూశారు..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..