Breaking News
  • కేంద్ర హోంశాఖ జారీ చేసిన సరికొత్త మార్గదర్శకాలు. కోవిడ్ ఆంక్షలు సడలిస్తూ కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు. పాఠశాలలు తెరిచే విషయంలో రాష్ట్రాలకే స్వేచ్ఛ. కంటైన్మెంట్ జోన్లలో మరింత కఠినంగా ఆంక్షలు. కంటైన్మెంట్ జోన్ల వెలుపల మరిన్ని సడలింపులు.
  • అక్టోబర్ 15 తర్వాత నుంచి ఆంక్షల సడలింపులు: 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు తెరిచేందుకు అనుమతి. క్రీడాకారులు ఉపయోగించే స్విమ్మింగ్ పూల్స్ తెరిచేందుకు అనుమతి. ఎంటర్‌టైన్మెంట్ పార్కులు, ఆ తరహా ప్రదేశాలు తెరిచేందుకు సైతం అనుమతి. తెరుచుకోనున్న అన్ని చోట్లా కఠినంగా కోవిడ్ జాగ్రత్తల అమలు. అక్టోబర్ 15 తర్వాత దశలవారిగా విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్రాలకు వెసులుబాటు. పాఠశాలల్లో కఠినంగా కోవిడ్ జాగ్రత్తల అమలు. ఆన్‌లైన్ - దూరవిద్య విధానాల కొనసాగింపు. ఆన్‌లైన్ తరగతులు కోరుకున్న విద్యార్థులకు కొనసాగించుకునే అవకాశం. విద్య, క్రీడ, వినోద, సాంస్కృతిక, మత, ధార్మిక, రాజకీయ సభలు సమావేశాలకు 100 మంది వరకు ఇప్పటికే అనుమతి. 100 మందికి మించి అనుమతించే విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ. మూసి ఉన్న హాల్స్ లో 50% సీటింగ్ సామర్థ్యంతో గరిష్టంగా 200 మంది వరకే అనుమతి. ఓపెన్ హాల్స్, బహిరంగ ప్రదేశాల్లో గ్రౌండ్ సామర్థ్యాన్ని బట్టి గరిష్ట సంఖ్య నిర్ణయం.
  • ఇప్పటికీ కొనసాగే ఆంక్షల్లో అంతర్జాతీయ విమానయానం. కంటైన్మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు కఠిన లాక్‌డౌన్. అంతర్రాష్ట్ర ప్రజా రవాణా, సరకు రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవు - కేంద్రం.
  • వైద్య, ఆరోగ్యశాఖ ఆస్పత్రులలో నాడు–నేడు పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష: నాడు–నేడు కార్యక్రమంలో ఆస్పత్రులలో చేపడుతున్న మార్పులతో పాటు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలల ప్రస్తుత పరిస్థితిని వివరించిన అధికారులు. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో వైద్య కళాళాలలకు సంబంధించి భూసేకరణతో పాటు, అవసరమైన అన్ని పనులు పూర్తయ్యాయని, టెండర్ల ఖరారుకు జ్యుడీషియల్‌ రివ్యూకు పంపిస్తున్నామని తెలిపిన అధికారులు.
  • అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా, తలసేమియా బాధితుల కోసం తెలంగాణా తెలుగు యువత, ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న రక్త దాన శిబిరానికి పిలుపును అందిస్తున్న హిందుపూర్ శాసన సభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు... ఈ సందర్భంగా వారు తలసేమియా వ్యాధి గురించి వివరిస్తూ, రక్త దానం పట్ల ప్రచారంలో ఉన్న పలు అపోహలను తొలగించారు... ఎంత అభివృద్ధి చెందినా రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదు కాబట్టి, తోటి ప్రాణాలను కాపాడడానికి మనకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం రక్త దానం మాత్రమే అని తెలుపుతూ అభిమానులు, కార్యకర్తలు, ఆరోగ్యం గా ఉన్న ప్రతి ఒక్కరూ రక్త దానం చేసి, ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు...
  • చెన్నై హిందూ మున్నని సంస్థ వ్యవస్థాపకుడు రామగోపాలన్ ( 94 ) మృతి . కరోనా మహమ్మారి కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి . 1980 లో హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ మున్నని అనే సంస్థను ఏర్పాటు చేసిన రామగోపాలన్. హిందూ ధర్మ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పలు ఉద్యమాలను నడిపించిన రామగోపాలన్ . హిందూ మున్నని సంస్థ వ్యవస్థాపకుడు రామగోపాలన్ మృతి సంతాపం తెలిపిన పలువురు రాజకీయ ప్రముఖులు .
  • విజయవాడ: వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి విడతగా 6540 కోట్లు కేటాయింపు. కృష్ణాజిల్లాలో ఔత్సాహిక రైతుల వ్యవసాయ అనుబంధ సంఘాలుకు ప్రాజెక్టులు ఏర్పాటు చేసి, బ్యాంకుల ద్వారా ఋణాలు. వ్యవసాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు 3 శాతం వడ్డీ రాయితీ. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్.

ప్రభాస్ సోదరుడిగా అథర్వ మురళి..!

రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం రాధే శ్యామ్‌. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న

Prabhas Radhe Shyam, ప్రభాస్ సోదరుడిగా అథర్వ మురళి..!

Prabhas Radhe Shyam: రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం రాధే శ్యామ్‌. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్, టీసిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌కి బ్రేక్ రాగా.. త్వరలో హైదరాబాద్‌లో చిత్రీకరణను ప్రారంభించేందుకు టీమ్ సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఇందులో ఓ కీలక పాత్రలో తమిళ యువ నటుడు అథర్వ మురళి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ చిన్న తమ్ముడిగా అథర్వ నటించబోతున్నట్లు సమాచారం. ఈ పాత్ర కాసేపే ఉన్నప్పటికీ, చాలా ఇంట్రస్టింగ్‌గా ఉండబోతున్నట్లు టాక్. అయితే దీనిపై ఇటు రాథే శ్యామ్ టీమ్ గానీ, అటు ఆ నటుడు గానీ ధృవీకరించలేదు. కాగా తమిళంలో పలు సినిమాల్లో నటించిన అథర్వ.. ఇటీవల తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చారు. వరుణ్‌ తేజ్ ప్రధాన పాత్రలో హరీష్‌ శంకర్ తెరకెక్కించిన గద్దలకొండ గణేష్‌లో అథర్వ నటించారు. ఈ మూవీ ద్వారా ఈ హీరో ఇక్కడ అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే.

Read More:

శ్రావణి కేసు: ఆర్‌ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి అరెస్ట్

ప్రారంభమైన ఆర్జీవీ బయోపిక్‌.. కెమెరా స్విచ్ఛాన్ చేసిన వర్మ తల్లి

Related Tags