అచ్చెన్న పిటిషన్‌పై ముగిసిన విచార‌ణ‌.. తీర్పు వాయిదా

ఈఎస్‌ఐ మెడిసిన్ కొనుగోలుకు సంబంధించి అవకతవకల కేసులో అరెస్టయిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్న‌త‌ న్యాయస్థానంలో విచారణ ముగిసింది.

అచ్చెన్న పిటిషన్‌పై ముగిసిన విచార‌ణ‌.. తీర్పు వాయిదా
Follow us

|

Updated on: Jul 06, 2020 | 5:21 PM

ఈఎస్‌ఐ మెడిసిన్ కొనుగోలుకు సంబంధించి అవకతవకల కేసులో అరెస్టయిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్న‌త‌ న్యాయస్థానంలో విచారణ ముగిసింది. తనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలా గ‌వ‌ర్న‌మెంటుని ఆదేశించాలని కోరుతూ అచ్చెన్నాయుడు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు తీర్పు ప్రకటనను ఎల్లుండికి వాయిదా వేసింది.

టీడీపీ హ‌యాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ఈఎస్‌ఐ హాస్పిట‌ల్స్ కు సంబంధించి మెడిసిన్, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ స‌ర్కార్ విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ దర్యాప్తునకు ఆదేశించింది. విజిలెన్స్‌ దర్యాప్తులో ఈఎస్‌ఐలో భారీ అవినీతి జరిగినట్లు తేలింది. నకిలీ కొటేషన్లతో ఆర్డర్స్ ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. విజిలెన్స్‌ కమిటీ నివేదిక ఆధారంగా యాంటీ క‌రెప్ష‌న్ బ్యూరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.