ఆస్ట్రేలియాలో 380 తిమింగలాలు మృత్యువాత…

గత వారంలో ఆస్ట్రేలియాలో దాదాపు 500 పైలట్ తిమింగలాలు చిక్కుకుపోయాయి. అందులో దాదాపు 380 తిమింగలాలు మృత్యువాత పడ్డాయి.

ఆస్ట్రేలియాలో 380 తిమింగలాలు మృత్యువాత...
Follow us

|

Updated on: Sep 24, 2020 | 5:36 PM

గత వారంలో ఆస్ట్రేలియాలో దాదాపు 500 పైలట్ తిమింగలాలు బీచ్ లో చిక్కుకుపోయాయి. అందులో దాదాపు 380 తిమింగలాలు మృత్యువాత పడ్డాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఒడ్డున చిక్కుకోవడం ఆస్ట్రేలియా చరిత్రలో మునుపెన్నడూ జరగలేదని, ఇదే ప్రథమమని అధికారులు వెల్లడించారు.. ఆస్ట్రేలియాలోని టాస్మానియా వెస్ట్ కోస్ట్ సముద్రపు తీరంలో 380 తిమింగలాలు చనిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సోమవారం నాడు ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. అయితే బుధవారం వరకు తాము 50 తిమింగలాలను కాపాడామని, మరో 30 తిమింగలాలను సముద్రంలోకి పంపడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. మిగితా వాటిని కూడా సురక్షితంగా సముంద్రంలోకి పంపే ప్రయత్నం తాము కొనసాగిస్తూనే ఉన్నామని, సమయం గడిచే కొద్ది వాటి పరిస్థితి చేయి దాటేట్లుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విముక్తి పొందిన పైలట్ తిమింగలాలు రాత్రిపూట నిస్సార జలాలకు తిరిగి వచ్చి మరోసారి ఇరుక్కుపోతాయని నిపుణులు హెచ్చరించారు.

అయితే, ఇంత పెద్ద సంఖ్యలో తిమింగలాలు ఒడ్డులో రావడంపై అధ్యయనం చేస్తున్నామని అధికారులు తెలిపారు. 1996 లో పశ్చిమ ఆస్ట్రేలియాలో సుమారు 320 పైలట్ తిమింగలాలు ఇదే తరహాలో మరణించాయని అధికారులు తెలిపారు. 2017లో న్యూజిలాండ్ లో స్ట్రాండింగ్ లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఇందులో 600 పైలట్ తిమింగలాలు బీచ్ వచ్చాయి. అందులో 400 మంది మరణించారు. కాగా, మృతదేహాలు కుళ్ళినప్పుడు అవి పేలిపోతాయని ఇది ప్రేక్షకులకు ముప్పు కలిగిస్తుందని ఆధికారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.