Raja Yoga: గ్రహ రాజు రవికి బలం.. ఈ రాశులవారు రారాజులు కాబోతున్నారు..!
నవంబర్ 16 నుండి డిసెంబర్ 16 వరకు గ్రహ రాజు రవి వృశ్చిక రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో రవి రెట్టింపు బలంతో ఐశ్వర్యం, అధికారం ప్రసాదిస్తాడు. మిథునం, సింహం, కన్య, మకరం, కుంభ రాశులకు విపరీత రాజయోగం పడుతుంది. ఈ నెల రోజులు ఈ ఐదు రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతులు, ఆస్తి లాభం, ఆర్థికాభివృద్ధి, వివాహ శుభకార్యాలు వంటి శుభఫలితాలు కలుగుతాయి. వారి జీవితం ఆనందంగా సాగుతుంది.

Raja Yoga
ఈ నెల (నవంబర్) 16 నుంచి డిసెంబర్ 16 వరకు గ్రహ రాజు రవి తనకు ఎంతో ఇష్టమైన వృశ్చిక రాశిలో సంచారం ప్రారంభించడం జరుగుతుంది. రవికి వృశ్చికం ఉచ్ఛ రాశితో సమానం. ఇక్కడ రవి గ్రహం రెట్టింపు బలంతో వ్యవహరిస్తారు. అధికారానికి, ఐశ్వర్యానికి, రాజకీయాలకు, ప్రభుత్వానికి, తండ్రికి కారకుడైన రవికి బలం పెరగడం వల్ల కొన్ని రాశులకు ఈ లక్షణాలన్నీ అనుకూల ఫలితాలనిస్తాయి. మిథునం, సింహం, కన్య, మకరం, కుంభ రాశులకు విపరీత రాజయోగం కలిగే అవకాశం ఉంది. నెల రోజుల పాటు వీరి జీవితం ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది.
- మిథునం: ఈ రాశికి ఆరవ స్థానంలో రవి సంచారం వల్ల ఈ రాశివారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉన్నతోద్యోగాలకు అవసరమైన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఈ రాశివారు తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. రవి తృతీయ స్థాన సంచారం వల్ల సాధారణంగా వీరిలో తెగువ, చొరవ, సాహసం వంటివి వృద్ధి చెందుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారమవుతుంది.
- సింహం: రాశ్యధిపతి రవి చతుర్థ స్థానంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశివారి ప్రాభవం, పలుకుబడి పెరగడం మొదలవుతుంది. వీరి కలలు చాలావరకు సాకారం అవుతాయి. ముఖ్యంగా సొంత ఇంటి కల నెరవేరుతుంది. వాహన యోగం కలుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి.
- కన్య: ఈ రాశికి రవి తృతీయ స్థానంలో ప్రవేశించడం జరుగుతుంది. తృతీయ స్థానంలో రవి బాగా చురుకుగా, బలంగా, స్వేచ్ఛగా వ్యవహరిస్తాడు. ఫలితంగా రవి గ్రహం ఈ స్థానంలో ఉన్నంత వరకు ఆర్థికాభివృద్ది ప్రయత్నాలు చురుకుగా సాగిపోయి ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
- మకరం: ఈ రాశికి లాభ స్థానంలో రవి ప్రవేశం ఈ రాశివారికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఉన్నత స్థాయి వారితో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్య లాభం కలుగుతుంది. ఇంట్లో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి.
- కుంభం: ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి కలుగుతుంది. జీతభత్యాలు బాగా వృద్ది చెందుతాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆశించిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.



