Rashi Phalalu: ప్రయాణాల్లో వారు జాగ్రత్తగా ఉండాలి.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today: మేష రాశి వారు ప్రస్తుతానికి ఎవరికైనా డబ్బు ఇవ్వడం కానీ, తీసుకోవడం గానీ పెట్టుకోవద్దు. ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం బాగా సానుకూలంగా సాగిపోతుంది. మిథున రాశి వారికి ఆర్థిక విషయాలకు, ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (నవంబర్ 11, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో స్థిరత్వం లభించవచ్చు. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ప్రస్తుతానికి ఎవరికైనా డబ్బు ఇవ్వడం కానీ, తీసుకోవడం గానీ పెట్టుకోవద్దు. ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. ఖర్చులకు కళ్లెం వేయాలి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కొందరు బంధు మిత్రులతో గతంలో ఏర్పడ్డ విభేదాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం బాగా సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్ని సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. రహస్యంగా ఉంచాల్సిన విషయాలను ఎవరితోనూ పంచుకోకపోవడం మంచిది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఆర్థిక విషయాలకు, ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎటువంటి అవాంతరాలూ లేకుండా ముఖ్యమైన పనులన్నీ సంతృప్తి కరంగా పూర్తవుతాయి. వృత్తి జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. వ్యాపారాలలో విశేషంగా లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూల పడతాయి. పిల్లలకు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత ఏర్పడుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికారుల ఆదరాభిమానాలను చూరగొంటారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా డిమాండ్ ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. మనసులోని కోరి కలు ఒకటి రెండు నెరవేరుతాయి. నిరుద్యోగులకు అనుకోకుండా కొత్త అవకాశాలు అందుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, వ్యాపారాల విషయంలో తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు తొలగిపోయి కాస్తంత ఊరట చెందుతారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులతో కలిసి ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. ప్రయాణాల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. రావలసిన డబ్బు వసూలు చేసుకుంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. ఇంటా బయటా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి విశ్రాంతి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సోదరులతో ఆస్తి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగ జీవితం సజావుగా సాగిపోతుంది. ముఖ్యమైన లక్ష్యాలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపా రాల్లో సొంత నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. పట్టుదలగా కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఏ ప్రయత్నాన్నీ వదిలిపెట్టకుండా కొనసాగిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి జీవితం బాగా బిజీగా పురోగమిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. తలపెట్టిన ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. రాజకీయ వర్గాల వారితో అనుకోకుండా సాన్నిహిత్యం ఏర్పడుతుంది. వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు సాగిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): అధికారుల అండదండలతో ఉద్యోగ సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్తరించడానికి అవసరమైన పెట్టుబడులు లభిస్తాయి. ఇంటికి ముఖ్యమైన బంధువులు వచ్చే అవకాశం ఉంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటి అవసరమైన వస్తు పరికరాలు కొనుగోలు చేస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు అందుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. జీవిత భాగస్వామి మీద మాత్రంకొద్దిగా వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు కొద్దిగా నిదానంగా పూర్తయే అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం అవసరం. ఎవరికీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా ఒత్తిడికి గురవుతారు. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది. ఉద్యోగ జీవితం బాగా సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని చాలావరకు అదుపు చేస్తారు. ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన మరింతగా పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాల మీద శ్రద్ధ పెడతారు. పిల్లల చదువుల విషయంలో శుభ వార్తలు వింటారు. రుణగ్రస్తుల నుంచి డబ్బు వసూలు అవుతుంది. బంధు మిత్రులలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో బాగా ఎంజాయ్ చేస్తారు. తోబుట్టువులు ఇంటికి వచ్చే సూచనలున్నాయి. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.



