
దిన ఫలాలు (మే 24, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగ్గా ఉంటాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. వృషభ రాశి వారు ఉద్యోగంలో తమ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. మిథున రాశి వారికి పెళ్లి ప్రయత్నాల్లో కొందరు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా వేగం పుంజుకుంటాయి. సోదరులతో రాజీమార్గం ద్వారా ఆస్తి వివాదం పరిష్కరించుకుంటారు. కొత్త వాహన కొను గోలు ప్రయత్నాలు చేపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగ్గా ఉంటాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలావరకు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువులు, పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరు బంధుమిత్రులతో వివాదాలు సర్దుమణుగుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.
పెళ్లి ప్రయత్నాల్లో కొందరు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరిగినప్పటికీ, నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆదాయ లాభం ఉంటుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. కుటుంబ సభ్యులతో హ్యపీగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్ని చక్కబెడతారు. ఆరోగ్యం పరవాలేదు.
ఆధ్యాత్మిక వ్యవహారాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. రాజపూజ్యాలు కాస్తంత ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ప్రతిఫలం ఎక్కువగానే ఉంటుంది. చేపట్టిన పనుల్లో కొద్దిగా ఆటంకాలు ఉండే అవకాశముంది. కొత్త ఉద్యోగం విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి.
కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. ఇంటా బయటా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. పెళ్లి తదితర శుభ కార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొందరు మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిరాటంకంగా పూర్తవుతాయి. విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. పిల్లల చదువుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా లాభాలకు లోటుండదు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది.
ఆర్థికం పురోభివృద్ధికి అవకాశముంది. ఉద్యోగరీత్యా చేసే ప్రయాణాలు లాభదాయకంగా కొనసాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికర పరిస్థితులుంటాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, కుటుంబం మీద బాగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తల్ని పాటించడం మంచిది.
వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి, పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటాయి. వ్యాపారాల్లో నష్టాల నుంచి చాలావరకు బయటపడతారు. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ, పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు. బంధు మిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. ప్రయాణాల్లో ఇబ్బందులెదురవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగంలో అధికారుల ఆదరణ పొందుతారు. వృత్తి, వ్యాపారాల విస్తరణకు అవకాశాలున్నాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు మరింత పుంజుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగ స్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ప్రయాణాల్లో కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది.
ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో పైచేయి సాధిస్తారు. కొత్త ఉద్యోగం విషయంలో శుభవార్తలు అందుతాయి. భవిష్యత్తుకు ఉపయోగపడే పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలు పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. కుటుంబ విషయాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఆరోగ్యం సంబంధమైన జాగ్రత్తలు పాటించడం అవసరం. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం మరింత పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొత్త కార్యక్రమాలు, కొత్త పనులు ప్రారంభిస్తారు. గృహ, వాహన సౌకర్యాలపై దృష్టి పెట్టే అవకాశముంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ పరిస్థితుల బాగా అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యాపా రాలు ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాల నుంచి కొంత ఊరట లభిస్తుంది. జీవిత భాగ స్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొందరు మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. స్వల్ప ధన లాభ సూచనలున్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు అనుకూల మైన వాతావరణం ఉంది. గృహ, వాహనాల కొనుగోలుపై దృష్టి పెడతారు. పిల్లలు పురోగతి సాధిస్తారు.