టీకా క్లినికల్ ట్రయల్స్‌పై ఆస్ట్రాజెనెకా బ్లూప్రింట్‌ విడుదల

బ్రిటీష్‌ ఫార్మాస్యూటికల్‌ దిగ్గజం ఆస్ట్రాజెనెకా తన కొవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ బ్లూప్రింట్‌ను విడుదల చేసింది. 111 పేజీల నివేదికతో క్లినికల్ ట్రయల్ బ్లూప్రింట్‌ను ఆన్‌లైన్‌లో ఉంచింది.

టీకా క్లినికల్ ట్రయల్స్‌పై ఆస్ట్రాజెనెకా బ్లూప్రింట్‌ విడుదల
Follow us

|

Updated on: Sep 21, 2020 | 4:04 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమేందుకు సైంటిస్టులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జన శ్రేయస్సు దృష్ట్యా తమ పరిశోధకులు, ప్రజారోగ్య నిపుణులు పారదర్శకతకోసం పిలుపునిచ్చిన నేపథ్యంలో బ్రిటీష్‌ ఫార్మాస్యూటికల్‌ దిగ్గజం ఆస్ట్రాజెనెకా తన కొవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ బ్లూప్రింట్‌ను విడుదల చేసింది. 111 పేజీల నివేదికతో క్లినికల్ ట్రయల్ బ్లూప్రింట్‌ను ఆన్‌లైన్‌లో ఉంచింది. ఇటీవల మోడెర్నా, ఫైజర్‌ కంపెనీలు తమ అధ్యయనాల బ్లూప్రింట్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుల సహకారంతో ఆస్ట్రాజెనెకా టీకాను తయారుచేస్తోంది. దీనిని ‘ఏజడ్‌డీ1222’గా పిలుస్తున్నారు. ఇండియాలో దీన్ని ‘కొవిషీల్డ్‌’ పేరుతో పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. మన దేశంలో టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ను కూడా సీరం సంస్థ నిర్వహిస్తోంది.

ఆక్స్‌ఫర్డ్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. భారత్‌తోపాటు యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో మూడో దశ ట్రయల్స్‌ తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే, యూకేలో టీకా తీసుకున్న కొంతమంది వలంటీర్లకు సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడంతో, దీనిపై యూఎస్‌ దర్యాప్తు కూడా చేపట్టింది. దీంతో అమెరికాలో నిర్వహించాల్సిన టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ నిలిపివేసింది. కాగా, ఆస్ట్రాజెనెకా తమ టీకా క్లినిక్ ట్రయల్స్ కు సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించి బ్లూప్రింట్‌ను విడుదల చేసింది.

మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..