భూమికి దగ్గరగా ఆస్ట్రాయిడ్‌..తప్పిన ప్రమాదం

అది ఓ భారీ ఆస్ట్రాయిడ్‌. అత్యంత ప్రమాదకరమైనది. న్యూయార్క్‌లోని వన్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ కంటే పెద్దది. ఎఫ్‌ 16 యుద్ధ విమానాల కన్నా 18 రెట్లు..అంటే 27వేల 5వందల మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అదే 2000 సీహెచ్‌ 59 గ్రహశకలం. భూమికి దగ్గరి నుంచి వెళ్తుందని నాసా సెంటర్‌ ఫర్‌ నియర్‌ ఎర్త్‌ ఆబ్జెక్ట్‌ స్టడీస్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు. డిసెంబర్‌ 26న ఉదయం 7.54 గంటలకు భూమికి అతి సమీపం నుంచి వెళ్తుందని తెలిపారు. ఐతే […]

భూమికి దగ్గరగా ఆస్ట్రాయిడ్‌..తప్పిన ప్రమాదం
Follow us

|

Updated on: Dec 26, 2019 | 5:49 PM

అది ఓ భారీ ఆస్ట్రాయిడ్‌. అత్యంత ప్రమాదకరమైనది. న్యూయార్క్‌లోని వన్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ కంటే పెద్దది. ఎఫ్‌ 16 యుద్ధ విమానాల కన్నా 18 రెట్లు..అంటే 27వేల 5వందల మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అదే 2000 సీహెచ్‌ 59 గ్రహశకలం. భూమికి దగ్గరి నుంచి వెళ్తుందని నాసా సెంటర్‌ ఫర్‌ నియర్‌ ఎర్త్‌ ఆబ్జెక్ట్‌ స్టడీస్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు. డిసెంబర్‌ 26న ఉదయం 7.54 గంటలకు భూమికి అతి సమీపం నుంచి వెళ్తుందని తెలిపారు. ఐతే ఈ గ్రహశకలం వలన భూమికి ఎలాంటి ముప్పు లేదని పేర్కొన్నారు.

శాస్త్రవేత్తలు చెప్పినట్లుగానే ఈ గ్రహశకలం భూమికి దాదాపు 45 లక్షల మైళ్ల దూరం నుంచి ప్రయాణించటంతో ప్రమాదం తప్పింది.  ఈ ఆస్ట్రాయిడ్‌ అంతరిక్షంలో ప్రయాణిస్తున్న మార్గాన్ని గమనిస్తే..మరో వందేళ్ల వరకు కూడా భూమికి ఎలాంటి ముప్పు లేదని వెల్లడించారు. నాసాకు చెందిన సీఎన్‌ఈవోఎస్‌ సంస్థ..460 ఫీట్ల వెడల్పుతో ఉన్న 25వేల గ్రహశకలాలను ట్రాక్‌ చేస్తుంది. వీటిలో కేవలం 35 శాతం మాత్రమే ప్రమాదకరమైనవని చెబుతున్నారు సైంటిస్టులు.