అసోం డీజీపీకి కరోనా పాజటివ్..!

రోజు రోజుకి కొవిడ్ బారిన పడుతున్న ప్రముఖుల జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా అసోం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు అధికారులు వెల్లడించారు.

అసోం డీజీపీకి కరోనా పాజటివ్..!
Follow us

|

Updated on: Aug 10, 2020 | 5:13 PM

కరోనా కరాళనృత్యానికి దేశం విలవిలలాడుతోంది. నిత్యం పెరుగుతున్న కేసులతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. చిన్న పెద్దా తేడా లేకుండా సామాన్యుడి నుంచి సెలబ్రేటీల దాకా కరోనా వైరస్ ధాటికి గురవుతున్నారు. రోజు రోజుకి కొవిడ్ బారిన పడుతున్న ప్రముఖుల జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా అసోం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్లో ఉన్నట్టు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇక డీజీపీతో సన్నిహితంగా మెలిగిన వారందరికీ ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మార్చి నుంచి ఇప్పటి వరకు అసోం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో దాదాపు 30 మంది కొవిడ్-19 బారిన పడ్డారని పోలీసు అధికారి వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఐజీపీ (లా అండ్ ఆర్డర్), డీఐజీ (అడ్మినిస్ట్రేషన్) తదితరులు కూడా ఉన్నారు. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,259 మంది పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడినట్టు అసోం అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) జీపీ సింగ్ వెల్లడించారు. వీరిలో 1,734 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇక ఇప్పటి వరకు ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారని సింగ్ తెలిపారు. మరోవైపు అసోంలో ఇప్పటి వరకు 58,837 మందికి కరోనా వైరస్ సోకినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ