ఆ అసెంబ్లీ సీటుకు 5 కోట్లు.. కాంగ్రెస్ నేత సెన్సేషనల్ కామెంట్..!

దేశవ్యాప్తంగా ప్రతికూల పవనాలు వీస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతల్లో మార్పు రావడం లేదు. ఎన్నికల్లో విజయం కోసం ఆ పార్టీ నేతలు వేస్తున్న ఎత్తులు ఒక్కోసారి వికటించి.. నవ్వుల పాలవుతోంది నూరేళ్ళకు పైగా చరిత్ర ఉన్న పార్టీ. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా హర్యానా లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల పంపిణీలో గందరగోళం ఏర్పడింది. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నవారిని పక్కన పెట్టి..కొత్తగా పార్టీలో చేరినవారికి టికెట్లు కేటాయించడంపై హర్యానా కాంగ్రెస్ మాజీ చీఫ్ అశోక్ […]

ఆ అసెంబ్లీ సీటుకు 5 కోట్లు.. కాంగ్రెస్ నేత సెన్సేషనల్ కామెంట్..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 02, 2019 | 6:10 PM

దేశవ్యాప్తంగా ప్రతికూల పవనాలు వీస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతల్లో మార్పు రావడం లేదు. ఎన్నికల్లో విజయం కోసం ఆ పార్టీ నేతలు వేస్తున్న ఎత్తులు ఒక్కోసారి వికటించి.. నవ్వుల పాలవుతోంది నూరేళ్ళకు పైగా చరిత్ర ఉన్న పార్టీ. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా హర్యానా లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల పంపిణీలో గందరగోళం ఏర్పడింది.

ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నవారిని పక్కన పెట్టి..కొత్తగా పార్టీలో చేరినవారికి టికెట్లు కేటాయించడంపై హర్యానా కాంగ్రెస్ మాజీ చీఫ్ అశోక్ తన్వర్ ఆందోళనకు దిగారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట తన అనుచరులతో కలిసి నిరసనకు దిగారు. ఐదేళ్లుగా చెమటోడ్చి పార్టీని బలోపేతం చేస్తూ..మేమంతా పార్టీకే అంకితమయ్యాము. మమ్మల్ని కాదని కొత్తగా పార్టీలో చేరినవారికి టికెట్లు ఎందుకు ఇస్తారని అధిష్టానాన్ని అశోక్ తన్వర్ ప్రశ్నించారు. సోహ్న అసెంబ్లీ స్థానం రూ.5 కోట్లకు అమ్ముడుపోయింది. టికెట్ల కేటాయింపు న్యాయబద్దంగా లేకపోతే ఎంపిక చేయబడ్డ అభ్యర్థులు ఎలా గెలుస్తారని అశోక్ తన్వర్ ప్రశ్నించారు. టిక్కెట్లను అమ్ముకోవడం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆనవాయితీ అని.. ప్రతీ ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులు వస్తుంటే అధిష్టానం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఎందుకు జంకుతోందని అయన ప్రశ్నిస్తున్నారు.