చాయ్ పొడి కేజీ రూ. 75 వేలా ..? నమ్మాల్సిందే !

Assam tea Powder

చాయే కదా అని చులకన చేయకండి.. దీనికీ బంగారంలాంటి ధర పలుకుతోంది మరి ! అస్సాం వెళ్తే అక్కడి ఓ వేలం కేంద్రంలో ఓ టీ పొడి కేజీ 75 వేల రూపాయలకు అమ్ముడు పోయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గౌహతి టీ ఆక్షన్ సెంటర్ ఈ మధ్యే ‘ గోల్డెన్ బటర్ ఫ్లై ‘ అనే నాణ్యమైన తేయాకుపొడిని వేలం వేసినప్పుడు ఇంతటి ధరకు అమ్ముడు పోయింది. దిబ్రూ గఢ్ సమీపంలోని డైకామ్ టీ ఎస్టేట్ ఉత్పత్తి చేస్తున్న ఈ టీ వెనుక ఓ చిన్న కథే ఉంది. గౌహతి లోని అస్సాం టీ ట్రేడర్లు తమ కస్టమర్ల కోసం ఎక్కడెక్కడికో వెళ్లి అతి పురాతనమైన తేయాకు అమ్మకం షాపుల నుంచి రకరకాల టీ పొడి తీసుకువస్తుంటారు. వీటిలో ఒక షాపు నుంచి గోల్డెన్ బటర్ ఫ్లై పేరిట గల ఈ టీ పొడి తెచ్చారట. అద్భుతమైన రుచి, సువాసన గల ఈ పొడితో తయారు చేసే చాయ్ తాగినవారు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని డిమాండ్ చేస్తున్నారట. దీంతో దీని ధర కూడా అమాంతం పెరిగిపోయింది. వేలంలో కేజీ రూ. 75 వేలు పలికి ‘ అబ్బో ‘ అనిపించింది. పైగా ఇది అంతర్జాతీయ చరిత్ర సృష్టించిందని. ప్రపంచ టీ చరిత్ర లోనే ఈ వేలం కేంద్రం రికార్డు నెలకొల్పిందని అంటున్నారు. ఆ మధ్య మైజాన్ ఆర్థోడాక్స్ గోల్డెన్ టీ అనే తేయాకు పొడి గత జులై 31 న కేజీ 70 వేల 501 రూపాయలు పలికితే ..గోల్డెన్ బటర్ ఫ్లై ఆ రికార్డును బద్దలు కొట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *