Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్ర నోడల్‌ ఆఫీసర్‌ రాంబాబు టీవీ9 గుడ్‌మార్నింగ్ ఇండియాలో చెప్పినట్టుగానే పాజిటివ్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి.
  • ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో కోత పెట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం కరెక్ట్‌ కాదంటున్నారు తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు. అధికారం ఉందని ఇష్ట ప్రకారం చేస్తామనడం సబబు కాదన్నారు.
  • కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది.. . ఇవాళ భేటి అయిన కేంద్ర కేబినెట్‌ ఇందుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మహమ్మారిపై యుద్ధం చేయడానికి నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో పార్లమెంట్‌ సభ్యుల వేతనాల్లో 30 శాతం కోత విధించారు.. ఏడాది పాటు కోత ఉంటుంది.
  • కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కొన్నిచోట్ల ప్రభుత్వ ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తిరునాళ్లను తలపిస్తోంది.
  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అకాలవర్షం భయపెడుతోంది. కర్నూలు, మహబూబ్‌నగర్‌ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతాల్లో జోరుగా వానపడింది. ఇటు వికారాబాద్‌ జిల్లా పర్గితో పాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోనూ వర్షం కురిసింది. వేసవి కాలంలో పడుతున్న ఈ అకాలవర్షంతో జనం బెంబేలెత్తారు.
  • కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలో కరోనా ల్యాబ్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. టెలీ మెడిసిన్‌ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ సడలింపు కేంద్రమే నిర్ణయించాలంటున్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.

తగలబడ్డ నది.. అధికారులు చెప్పిన రీజన్ వింటే షాక్…

Assam River On Fire For 2 Days After Crude Oil Pipeline Bursts, తగలబడ్డ నది.. అధికారులు చెప్పిన రీజన్ వింటే షాక్…

మంటల్నీ ఆర్పాలంటే నీరు కావాల్సిందే. మరి ఆ నీరు ఉన్న నదిలో మంటలు వస్తే ఎలా..? అసలు వినడానికే ఇది వింతగా ఉన్నా.. అసోంలో జరిగిన ఘటన చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇలా కూడా నదుల్లో మంటలు వస్తాయా అని షాక్ తింటారు. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రానికి చెందిన ఓ నది మధ్య భాగంనుంచి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దిబ్రూగఢ్‌ జిల్లాలోని బుర్హిదింగ్‌ నది కింది భాగం నుంచి.. ఆయిల్ పైప్‌లు వెళ్తున్నాయి. అయితే సడన్‌గా ఆ ఆయిల్ పైప్ పేలడంతో.. నదిలో మంటలు చెలరేగాయి. పైప్ లైన్ కాస్త నది అంతర్భాగంలోనే పేలిపోవడంతో.. నదిపైన పెత్త ఎత్తున మంటలు చెలరేగాయి.

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన దులియాజన్ ప్లాంట్ నుంచి.. ఈ ముడిచమురు తీసుకు వెళ్లే పైపు లైను నది తీరంలో లీక్ అవ్వడంతో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఆయిల్ లీక్ అయిన తర్వాత అది కాస్త నదిలోకి వచ్చిందని తెలిపారు. అయితే ఇది గమనించిన ఎవరైనా.. నదీ తీరంలో నిప్పు పెట్టి ఉంటారని.. అందుకే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. మరోవైపు జనవరి 31 నుంచి క్రూడ్ ఆయిల్ లీక్ అయినా.. అధికారులు పట్టించుకోలేదని.. నహర్కటియాలోని సాసోని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కాగా అధికారులు మాత్రం.. ప్రస్తుతం మంటలు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాలేదని స్పష్టం చేశారు.

Related Tags