అక్కడ 7 రోజులే హోం క్వారంటైన్..

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారికి ఆసోం ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.

అక్కడ 7 రోజులే హోం క్వారంటైన్..
Follow us

| Edited By:

Updated on: Jul 25, 2020 | 2:39 PM

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారికి ఆసోం ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. వారు డిశ్చార్జ్ అయిన తరువాత ఇకపై వారం రోజులు మాత్రమే హోం క్వారంటైన్‌లో ఉండాలంటూ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో 14 రోజులుగా ఉన్న హోం క్వారంటైన్ గడువును ఏడు రోజులకు కుదించింది.

కాగా.. డిశ్చార్జ్ అయిన వారికి ప్రభుత్వం అందిస్తూ వచ్చిన రూ. రెండు వేల విలువైన అత్యవసర వస్తువుల పంపిణీ కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దారిద్య్రరేఖకు దిగువను ఉన్న వారికి మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. అయితే..సందర్భాన్ని బట్టి వృద్ధులకు, వికలాంగులకు, దీర్ఘరోగ వ్యాధిగ్రస్తులకు ఈ సౌలభ్యాన్ని వర్తింపజేసేందుకు డిప్యుటీ కమిషనర్‌కు అధికారాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అసోంలో ఇప్పటివరకూ 29,921 కరోనా కేసులు నమోదయ్యాయి.

Also Read: తెలంగాణలో.. మూతపడనున్న 16 ఇంజనీరింగ్‌ కాలేజీలు..!