ఆ రాష్ట్రంలో సెప్టెంబర్‌ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం..!

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభించేందుకు అసోం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ఆ రాష్ట్రంలో సెప్టెంబర్‌ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం..!
Follow us

| Edited By:

Updated on: Aug 01, 2020 | 11:35 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభించేందుకు అసోం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ‘సెప్టెంబర్‌ 1 నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించేందుకు మానసికంగా సన్నద్ధమవుతున్నామని, అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’ ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హిమంత బిశ్వా శర్మ శనివారం తెలిపారు. ఒకటి నుండి నాలుగో తరగతి విద్యార్థులకు పాఠశాల ఉండదని, 5-8 తరగతుల విద్యార్థుల కోసం తరగతులను గ్రామక్షేత్రం, లేదా బహిరంగా ప్రదేశాల్లో నిర్వహించవచ్చని వెల్లడించారు.

కరోనా సంక్షోభం నేపథ్యంలో.. ఒకేసారి గరిష్టంగా 15 మంది విద్యార్థులు తరగతులకు హాజరుకావచ్చు. విద్యావంతులైన యువత స్వచ్ఛందంగా తరగతులు తీసుకొని ఉపాధ్యాయులకు సహాయం చేయవచ్చని చెప్పారు. దీనికి సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. 9-12వ తరగతుల విద్యార్థుల కోసం పాఠశాలలో తమ క్యాంపస్‌లో తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. 9, 11 తరగతుల విద్యార్థులకు వారానికి రెండు సార్లు, 10, 12 తరగతులకు వారానికి నాలుగు రోజులు తరగతులు ఉంటాయి. మూడు గంటల చొప్పున రెండు షిఫ్టులు ఉంటాయి. గరిష్ఠంగా 15 మంది విద్యార్థులను ఒకే గదిలో కూర్చోవడానికి అనుమతి ఇవ్వనున్నారు.