అరుదైన “అస్సాం కీల్‌బ్యాక్” ..129 ఏళ్ల త‌ర్వాత క‌నిపించింది

కరోనా వైర‌స్..మ‌నుషులంద‌ర్నీ ఇంట్లోకి నెట్టిస్తోంది. బ‌య‌ట‌కు వ‌స్తే బెంబేలెత్తిస్తోంది. కానీ జంతువులు, పక్షులు మాత్రం హాయిగా రోడ్ల‌పై సంచ‌రిస్తున్నాయి. కాలుష్యం త‌గ్గిపోవ‌డంతో ప‌క్షులు స్వేచ్చ‌గా విహ‌రిస్తున్నాయి.

అరుదైన  “అస్సాం కీల్‌బ్యాక్” ..129 ఏళ్ల త‌ర్వాత క‌నిపించింది
Follow us

|

Updated on: Jul 12, 2020 | 11:31 PM

కరోనా వైర‌స్..మ‌నుషులంద‌ర్నీ ఇంట్లోకి నెట్టిస్తోంది. బ‌య‌ట‌కు వ‌స్తే బెంబేలెత్తిస్తోంది. కానీ జంతువులు, పక్షులు మాత్రం హాయిగా రోడ్ల‌పై సంచ‌రిస్తున్నాయి. కాలుష్యం త‌గ్గిపోవ‌డంతో ప‌క్షులు స్వేచ్చ‌గా విహ‌రిస్తున్నాయి. చాలాకాలంగా క‌నిపించ‌ని ఫ్లెమింగోలు, క్లౌడ్ కోకిలలు, డాల్ఫిన్లు సైతం ఇటీవ‌ల ప‌రిస్థితుల వ‌ల్ల ఇండియాలో ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఇప్పుడు ఆ లిస్టులో అరుదైన‌ సరీసృపాలు కూడా చేరాయి. అంతరించిపోయినదిగా పరిగణిస్తోన్న‌ , “అస్సాం కీల్‌బ్యాక్” అని పిలువబడే పాము జాతి ఈశాన్య భారతదేశంలోని… అస్సాంలో 129 సంవత్సరాల తిరిగి ద‌ర్శ‌న‌మిచ్చింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైంటిస్టులు ఈ విషం లేని పాము జాతిని తిరిగి కనుగొన్నట్లు క‌న్పామ్ చేశారు, వీటి ఫోటోలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

“అస్సాం కీల్‌బ్యాక్” అని సంబోధించే ‘హెబియస్ పీలి’ జాతికి చెందిన రెండు మగ పాములను 1891 లో మొద‌టిసారి బ్రిటిష్ టీ-ప్లాంటర్ శామ్యూల్ ఎడ్వర్డ్ పీల్ అసోంలోని సిబ్సాగర్ జిల్లా పరిధిలో కనుగొన్నారు. వాటిని సేక‌రించి ఒక‌దాన్ని కోల్‌కతాలోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు, మరొకదాన్ని లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంకు అప్ప‌గించారు. ఆ త‌ర్వాత ఈ రకం పాములను ఎవ్వ‌రికీ క‌నిపించ‌క‌పోవ‌డంతో అంత‌రించిపోయిన‌విగా ప‌రిగణించారు.

తాజాగా ఈ జాతి పామును, అసోం-అరుణాచల్ ప్రదేశ్ బార్డ‌ర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 2018 సెప్టెంబర్‌లో గుర్తించారు. అన్ని నిర్దార‌ణల‌ను చేసుకున్న అనంత‌రం.. జర్మనీ నుంచి ప్రచురితమవుతున్న ఇంట‌ర్నేష‌న‌ల్ పత్రిక వెర్టెబ్రేట్ జువాలజీలో ఈ పాము గురించిన వివ‌రాల‌ను ఇటీవ‌ల‌ ప్రచురించారు.

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?