Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 22 వేల 771 మంది వైరస్​ సోకింది. మరో 442 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,315. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,35,433. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,94,227. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,655.
  • తెలంగాణలో ప్రజా ప్రతినిధులను వణికిస్తున్న కరోనా. ప్రగతి భవన్‌లో 30మందికిపైగా సిబ్బందికి కరోనా మరో 15రోజులపాటు ప్రగతి భవన్‌కు సీఎం దూరం. నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా- కోలుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు. యశోదలో చికత్స పొందుతున్న మహిళా ఎమ్మెల్యే. డిశ్చార్చి అయిన రాష్ట్ర హోంమంత్రి. హోం క్వారెంటైన్‌లోనే డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు. కరోనా వచ్చిన వెల్లడించని ఐదుగురికిపైగా ఎమ్మెల్యేలు. హోంక్వారైంట్‌న్‌లో చికిత్స.
  • తిరుమల: టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం. టిటిడి బోర్డ్ మీటింగ్ ని ఇకపై ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయం . ఇకపై జరిగే అన్ని బోర్డ్ మీటింగులను అసెంబ్లీ సమావేశాల మాదిరి ఎస్వీబీసీ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. బోర్డ్ మీటింగ్ లో జరిగే చర్చ అంతా పారదర్శకంగా ప్రజలందరికీ తెలిసేలా ప్రత్యక్ష ప్రసారం.
  • నల్లగొండ: రాంగోపాల్ వర్మ నిర్మించబోయే మర్డర్ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి బాలస్వామి. సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఆయన ఫిర్యాదు దాఖలు .దీనిపై స్పందించిన ఎస్సీ ఎస్టీ కోర్టు. రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులను ఆదేశించిన ఎస్సీ ఎస్టీ కోర్టు.
  • నిర్మాత పోకూరి రామారావు ఈరోజు ఉదయం కరోన కారణంగా మృతి చెందారు. పోకూరి రామారావు పోకూరి బాబురావు సోదరుడు. ఈతరం ఫిలిమ్స్ లో ఎన్నో చిత్రాలు తీశారు.
  • యాదాద్రి: ప్రభుత్వ విప్ గొంగిడి సునీత భర్త, నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేసిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని నిర్ధారించిన డాక్టర్లు. నిన్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు, ఇద్దరు డ్రైవర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ.

అసోంలో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన రహదారులు.. స్తంభించిన రాకపోకలు..

Assam highway smashed by floods Amphan cyclone, అసోంలో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన రహదారులు.. స్తంభించిన రాకపోకలు..

ఎంఫన్ తుఫాన్ ప్రభావంతో ఈశాన్య భారతం విలవిలలాడుతోంది. జోరుగా కురుస్తున్న వర్షాలతో బ్రహ్మపుత్ర నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అసోంలో గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో వరదలు పోటెత్తుతున్నాయి. ఈ వరదల ధాటికి సోమవారం గోల్పారా జిల్లాలోని అగియా-లఖీంపూర్‌ జాతీయ రహదారి తెగిపోయింది. దీంతో రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. దాదాపు వంద మీటర్ల మేర 12వ నెంబర్‌ జాతీయ రహదారి కొట్టుకు పోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.
కుండపోత వర్షాలతో బ్రహ్మపుత్ర నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నది. నదీ పరివాహక ప్రాంతంలోని పంటలు, ఆవాసాలు మొత్తం నీట మునిగాయి. దీంతో వందలాది మంది జనం నిరాశ్రయులయ్యారు. వరదలవల్ల అసోం రాష్ట్రంలోని చెరువులు, కుంటల కట్టలు తెగిపోయాయి. పలు ప్రాంతాల్లో చిన్నచిన్న రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో వివిధ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నిరాశ్రయులైన వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

 

 

Related Tags