ఇయర్ ఫోన్స్ ఎక్కడికి ఎలా వచ్చాయి..?

ఓ వ్యక్తి కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు ఒక్కసారిగా ఖంగుతున్నారు. అతడి యూరినరీ బ్లాడర్ లో ఓ కేబుల్ కనపడింది. చివరికి వైద్యులు ఆపరేషన్ చేసిన తీసిన ఘటన అస్సాంలో జరిగింది.

ఇయర్ ఫోన్స్ ఎక్కడికి ఎలా వచ్చాయి..?
Follow us

|

Updated on: Jun 05, 2020 | 10:18 PM

ఓ వ్యక్తి కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు ఒక్కసారిగా ఖంగుతున్నారు. అతడి యూరినరీ బ్లాడర్ లో ఓ కేబుల్ కనపడింది. చివరికి వైద్యులు ఆపరేషన్ చేసిన తీసిన ఘటన అస్సాంలో జరిగింది. దీస్ పూర్ కు చెందిన ఓ 30 ఏళ్ల వ్యక్తి కడుపు నొప్పిగా ఉందంటూ స్థానిక ఆసుపత్రికి వచ్చాడు. వెంటనే డాక్టర్లు అతడిని పరీక్షలు చేశారు. ఎండోస్కోపీ, లాబోరేటరీ టెస్టులతో సహా అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. అయినా ఎక్కడా ఏమీ కనపడలేదు. దీంతో సీనియర్ డాక్టర్ వాలీ ఇస్లాం అతడికి ఎక్స్‌-రే తీయించాడు. వచ్చిన రిపోర్టులు చూసిన డాక్టర్లు షాక్ గురయ్యారు. అతడి మూత్రాశయంలో చుట్టలు చుట్టుకుని ఉన్న ఓ కేబుల్ కనపడింది. దీంతో ఆ వ్యక్తి ఆపరేషన్ చేసి కేబుల్‌ని బయటకు తీశారు వైద్యులు. అయితే అది ఇయర్‌ఫోన్ కేబుల్ కావడంతో వైద్య సిబ్బందికి మరింత అశ్చర్యాన్ని కలగించింది. ఈ సంఘటనకు సంబంధించిన కొన్ని ఫోటోలను, ఆపరేషన్ చేసి కేబుల్‌ను బయటకు తీసిన వీడియోను ఇస్లాం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. తన 25 ఏళ్ల ఇలాంటి కొన్ని కేసులు చూసినప్పుడు తాను ఫాక్ అవుతుంటానని ఇస్లాం అందులో రాసుకొచ్చాడు. అయితే తన కడుపులోకి ఎలా వచ్చిందని మాత్రం ఆ యువకుడు చెప్పడంలేదని డాక్టర్ ఇస్లాం తెలిపారు.