అసోంలో 19లక్షల మందికి షాక్.. ఎన్ఆర్సీ లిస్ట్ రిలీజ్..

అసోం రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్సీ తుది జాబితాను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ తుది జాబితా నుంచి 19,06,657 మంది పౌర‌స‌త్వాన్ని తొలగించగా.. సుమారు 3.11 కోట్ల మందికి అవ‌కాశం క‌ల్పించారు. కేంద్రం గ‌తేడాది ఎన్ఆర్‌సీ ముసాయిదాను త‌యారు చేశారు. అప్పట్లో ఆ జాబితాలో సుమారు 40 ల‌క్ష‌ల మందిని వ‌దిలేశారు. అయితే నిజ‌మైన పౌరుల‌ను ఆదుకుంటామ‌ని ఆ రాష్ట్ర సీఎం శ‌ర‌బానంద సోనోవాల్ తెలిపారు. దీనికి సబంధించిన లిస్టును ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అయితే ఇప్పుడు […]

అసోంలో 19లక్షల మందికి షాక్.. ఎన్ఆర్సీ లిస్ట్ రిలీజ్..
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2019 | 1:34 PM

అసోం రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్సీ తుది జాబితాను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ తుది జాబితా నుంచి 19,06,657 మంది పౌర‌స‌త్వాన్ని తొలగించగా.. సుమారు 3.11 కోట్ల మందికి అవ‌కాశం క‌ల్పించారు. కేంద్రం గ‌తేడాది ఎన్ఆర్‌సీ ముసాయిదాను త‌యారు చేశారు. అప్పట్లో ఆ జాబితాలో సుమారు 40 ల‌క్ష‌ల మందిని వ‌దిలేశారు. అయితే నిజ‌మైన పౌరుల‌ను ఆదుకుంటామ‌ని ఆ రాష్ట్ర సీఎం శ‌ర‌బానంద సోనోవాల్ తెలిపారు. దీనికి సబంధించిన లిస్టును ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అయితే ఇప్పుడు ఆ వెబ్ సైట్‌ మొరయిస్తున్నట్లు  తెలుస్తోంది. ఎన్ఆర్‌సీ జాబితా విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. జాబితాలో పేరు లేనంత మాత్రాన విదేశీయులు కార‌ని, వాళ్లు ఫారిన్ ట్రిబ్యునల్‌కు అప్పీల్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.