బీహార్,అసోం వరదలతో జనం విలవిల

ఈశాన్య భారతంలో వరదలు బీభత్సం కొనసాగుతోంది. బీహార్, అసోం రాష్ట్రాల్లో ఈ వరదల విలయానికి ఇప్పటి వరకు మృత్యువాతపడ్డవారి సంఖ్య శుక్రవారం నాటికి 139కి పెరిగింది.మరోవైపు అసోంలో వర్షాలు తగ్గుముఖం పట్టినా బ్రహ్మపుత్ర, ధన్‌సిరి, జియా భరాలి, కొపిలి నదులు ఇప్పటికీ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 3,705 గ్రామాలకు చెందిన 48.87 లక్షలమంది వరదల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. అసోం, బీహార్ రాష్ట్రాల్లో కలిపి 1.10 కోట్లమందికిపైగా ప్రజలు జల విలయం చిక్కుకొని ఆపన్న హస్తం […]

బీహార్,అసోం వరదలతో జనం విలవిల
Follow us

| Edited By:

Updated on: Jul 20, 2019 | 6:14 AM

ఈశాన్య భారతంలో వరదలు బీభత్సం కొనసాగుతోంది. బీహార్, అసోం రాష్ట్రాల్లో ఈ వరదల విలయానికి ఇప్పటి వరకు మృత్యువాతపడ్డవారి సంఖ్య శుక్రవారం నాటికి 139కి పెరిగింది.మరోవైపు అసోంలో వర్షాలు తగ్గుముఖం పట్టినా బ్రహ్మపుత్ర, ధన్‌సిరి, జియా భరాలి, కొపిలి నదులు ఇప్పటికీ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 3,705 గ్రామాలకు చెందిన 48.87 లక్షలమంది వరదల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. అసోం, బీహార్ రాష్ట్రాల్లో కలిపి 1.10 కోట్లమందికిపైగా ప్రజలు జల విలయం చిక్కుకొని ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే రెండు రాష్ట్రాల్లో కలిపి 1.10 కోట్లమందికిపైగా ప్రజలు జల విలయం గుప్పిట్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు.