బిల్డింగ్ పై నుంచి దూకి నటి ఆత్మహత్య

Aspiring Actress Allegedly Jumps To Death From Apartment Terrace In India, బిల్డింగ్ పై నుంచి దూకి నటి ఆత్మహత్య

ముంబైలో ఓ నటి అర్థరాత్రి బిల్డింగ్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతురాలు పంజాబ్‌కు చెందిన ఔత్సాహిక నటిగా గుర్తించారు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరికతో.. చిత్రరంగంలోకి ప్రవేశించాలని బాధితురాలు ముంబయికి వచ్చినట్లు తెలిపారు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ నటిగా సినీ రంగంలో అవకాశం రాలేదని.. మానసికంగా బాధపడుతూ ఉండేదని బాధితురాలి కుటుంబసభ్యులు వాపోయారు. అంతేకాదు తరచూ తల్లితో గొడవ పడుతూ ఉండేదని అన్నారు. గతంలో కూడా రెండు సార్లు ఆత్మహ్యతకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *