కెసీఆర్‌కు గ్రీన్ ట్రిబ్యునల్ షాక్.. కాళేశ్వరంపై రచ్చ

కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు వేగంతో పూర్తి చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నామని చెప్పుకుంటున్న గులాబీ బాస్, ముఖ్యమంత్రి కెసీఆర్‌కు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ షాకిచ్చింది. ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్‌పై జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో బుధవారం విచారణ జరిగింది. ప్రాజెక్టు సామర్ధ్యం పెంచారంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. పెంచిన సామర్ధ్యానికి పర్యావరణ అనుమతులు […]

కెసీఆర్‌కు గ్రీన్ ట్రిబ్యునల్ షాక్.. కాళేశ్వరంపై రచ్చ
Follow us

|

Updated on: Dec 11, 2019 | 3:03 PM

కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు వేగంతో పూర్తి చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నామని చెప్పుకుంటున్న గులాబీ బాస్, ముఖ్యమంత్రి కెసీఆర్‌కు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ షాకిచ్చింది. ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్‌పై జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో బుధవారం విచారణ జరిగింది.

ప్రాజెక్టు సామర్ధ్యం పెంచారంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. పెంచిన సామర్ధ్యానికి పర్యావరణ అనుమతులు తీసుకోలేదంటూ హయాతుద్దీన్ అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జాతీయ హరిత ట్రైబ్యునల్ విచారించింది. ముందే ఖరారు చేసిన డిజైన్‌లో మార్పులు చేసినపుడు దానికి అనుమతి తీసుకోవాల్సి వుంటుందని, కానీ కెసీఆర్ ప్రభుత్వం దానికి అనుమతి తీసుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది ట్రిబ్యునల్‌కు నివేదించారు.

కేసు తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. మూడు వారాల్లోకి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.