ఆసియా సెక్సీయెస్ట్ మెన్ లిస్ట్‌లో రెబల్ స్టార్ ప్రభాస్..

టాలీవుడ్ బాహుబలి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు అరుదైన ఘనత దక్కింది. ఆసియా సెక్సీయెస్ట్‌ మెన్-2019 టాప్ 10 జాబితాలో చోటుదక్కింది. ఈ లిస్ట్‌లో దక్షిణాది నుంచి చోటుదక్కించుకున్న నటుడుగా ప్రభాస్ రికార్డు సృష్టించారు. తాజాగా.. బ్రిటీష్‌ న్యూస్‌ వీక్లి, ఈస్ట్రన్‌ ఐ సంస్థలు కలిసి..‘సెక్సీయెస్ట్‌ ఆసియన్‌ మ్యాన్‌ ఆఫ్ 2019’ సర్వేను చేపట్టారు. వరల్డ్‌వైడ్‌గా ఉన్న సినీ అభిమానుల ఆన్‌లైన్‌ ఓటింగ్‌ను బేస్‌ చేసుకుని..ఈ సర్వేను నిర్వహించారు. అయితే ఈ సర్వేకు సంబంధించిన లిస్ట్‌ను బుధవారం […]

ఆసియా సెక్సీయెస్ట్ మెన్ లిస్ట్‌లో రెబల్ స్టార్ ప్రభాస్..
Follow us

| Edited By:

Updated on: Dec 06, 2019 | 4:04 AM

టాలీవుడ్ బాహుబలి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు అరుదైన ఘనత దక్కింది. ఆసియా సెక్సీయెస్ట్‌ మెన్-2019 టాప్ 10 జాబితాలో చోటుదక్కింది. ఈ లిస్ట్‌లో దక్షిణాది నుంచి చోటుదక్కించుకున్న నటుడుగా ప్రభాస్ రికార్డు సృష్టించారు.

తాజాగా.. బ్రిటీష్‌ న్యూస్‌ వీక్లి, ఈస్ట్రన్‌ ఐ సంస్థలు కలిసి..‘సెక్సీయెస్ట్‌ ఆసియన్‌ మ్యాన్‌ ఆఫ్ 2019’ సర్వేను చేపట్టారు. వరల్డ్‌వైడ్‌గా ఉన్న సినీ అభిమానుల ఆన్‌లైన్‌ ఓటింగ్‌ను బేస్‌ చేసుకుని..ఈ సర్వేను నిర్వహించారు. అయితే ఈ సర్వేకు సంబంధించిన లిస్ట్‌ను బుధవారం లండన్‌లో విడుదల చేశారు. అయితే ఈ లిస్ట్‌లో..బాలీవుడ్‌ హీరో హృతిక్ రోషన్‌ తొలి స్థానాన్ని కైవసం చేసుకోగా, యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ పదో స్థానాన్ని దక్కించుకున్నారు.