క‌రోనా క‌ష్ట‌కాలంలో కార్మికులకు జీతాల పెంపు…

దీని కోసం ఆయా డీలర్ల ఖాతాల్లోకి రూ. 40 కోట్లను బదిలీ చేసినట్టు తెలిపింది. వీటితో పాటు బీమా, ఆస్ప‌త్రి ఖర్చులకు సాయం అందిస్తామని ఆ సంస్థ సీఈవో వివరించారు.

క‌రోనా క‌ష్ట‌కాలంలో కార్మికులకు జీతాల పెంపు…
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 16, 2020 | 4:23 PM

దేశంలో క‌రోన వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా కేంద్రం లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది. దీంతో అన్ని మూతబడిపోయాయి. ఏ ప‌నులు జ‌ర‌గ‌టం లేదు. కార్మికులు, కూలీలు, ఉద్యోగులు అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఉద్యోగుల‌ను ఇళ్ల‌లో కూర్చొబెట్టి జీతాలు ఇవ్వ‌లేక ప‌లు ప్రైవేటు కంపెనీలు ఉద్యోగుల‌ను తొల‌గించాల‌ని యోచిస్తున్నాయి. మ‌రికొన్ని సంస్థ‌లు స‌గం జీతాలు చెల్లిస్తూ…నెట్టుకొస్తున్నాయి. ఇటువంటి క‌ష్ట‌కాలంలోనూ ఓ సంస్థ గొప్ప మ‌న‌సు చాటుకుంది. త‌మ ఉద్యోగుల‌కు జీతాలు పెంచుతూ వారికి భ‌రోసా క‌ల్పించింది.

ఎషియన్ పెయింట్స్  గొప్ప పేరున్న సంస్థ త‌మ ఉద్యోగుల‌కు జీతాలు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది.  కష్ట కాలంలోనూ తమ సిబ్బందికి జీతాలు పెంచి అందరిని ఆశ్చర్యపరిచింది.  దీని కోసం ఆయా డీలర్ల ఖాతాల్లోకి రూ. 40 కోట్లను బదిలీ చేసినట్టు తెలిపింది. వీటితో పాటు బీమా, ఆస్ప‌త్రి  ఖర్చులకు సాయం అందిస్తామని ఆ సంస్థ సీఈవో అమిత్ సింగ్డే వివరించారు. కాగా ఇప్పటికే కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వానికి 35 కోట్లు భారీ విరాళం ఇచ్చారు. దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కూడా కొంత మంది జీతాల్లో కోత పెట్టిన సమయంలో ఎషియన్ పెయింట్స్ చేసిన సాయంపై నెటిజ‌న్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.