సాయానికి క్రికెటర్లు రాలే.. ‘కలియుగ కర్ణుడు’ సోనూసూద్ వచ్చాడు.!

కరోనా వైరస్ వల్ల ప్రజల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. ఎంతోమంది రోడ్డున పడుతున్నారు. చాలామంది కష్టాలు అనుభవిస్తున్నారు.

సాయానికి క్రికెటర్లు రాలే.. 'కలియుగ కర్ణుడు' సోనూసూద్ వచ్చాడు.!
Follow us

|

Updated on: Aug 24, 2020 | 1:46 AM

Ashraf Chaudhary Mumbai: కరోనా వైరస్ వల్ల ప్రజల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. ఎంతోమంది రోడ్డున పడుతున్నారు. చాలామంది కష్టాలు అనుభవిస్తున్నారు. అయితే ఈ కరోనా కాలంలో వలస కార్మికులకు, పేదలకు, కూలీలకు ‘నేనున్నాను’ అని అంటూ బాలీవుడ్ నటుడు సోనూసూద్ అండగా నిలిచాడు.

కష్టం వస్తే చాలు.. ప్లేస్ ఏదైనా పట్టింపు లేదు.. క్షణాల్లో అక్కడ ఉంటున్నాడు. ఒక్క లాక్ డౌన్ సమయంలోనే కాదు.. ఇప్పటికీ అతడు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆడుకోవడానికి ముందుకు వస్తున్నాడు. ఈ రీల్ విలన్.. ఇప్పుడు దేశప్రజల దృష్టిలో రియల్ హీరో. అతడు తాజాగా మరొకరికి నేనున్నానని అభయం ఇచ్చాడు.

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్లకు బ్యాట్లు రిపేర్ చేసిన అష్రఫ్ భాయ్ కిడ్నీ ఆపరేషన్‌కు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాడు. ముంబై చెందిన ఈ అష్రఫ్ భాయ్ దీనగాధ గురించి ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. సోనూసూద్ స్పందించి అతడి అడ్రెస్ అడిగాడు. దిగ్గజ క్రికెటర్లు ఎవరూ కూడా అష్రఫ్‌ను పట్టించుకోకపోయినా.. సోనూసూద్ ముందుకు రావడం పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.