ఆర్చర్ బంతి.. స్టీవ్ స్మిత్‌ తలకు గాయం

Steve Smith hit by Jofra Archer in Second Test, ఆర్చర్ బంతి.. స్టీవ్ స్మిత్‌ తలకు గాయం

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ రెండో టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ ఆర్చర్ వేసిన బంతి ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్‌ స్మిత్ తలకు తగిలింది. దీంతో స్మిత్‌కు బలమైన గాయమైంది. వెంటనే అక్కడున్న వైద్య బృందాలకు అతడికి చికిత్సను అందించాయి. ఇక ఆసీస్ వైద్యుల సూచన మేరకు స్మిత్.. రిటైర్డ్ హార్డ్‌గా వెనుదిరిగాడు. అప్పటికి స్మిత్ 80 పరుగులతో ఉన్నాడు. ఇక ఆ తరువాత సిడిల్ ఔట్ అయిన తరువాత తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్ మరో 12 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో యాషెస్‌లో వరుసగా ఏడుసార్లు 50 పరుగులకు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా స్మిత్ రికార్డు సృష్టించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *