Breaking News
  • భారత్ దేశంలో 6 లక్షలు దాటినా కరోనా పాజిటివ్ కేసులు. గడిచిన ఐదు రోజుల్లోనే లక్ష కేసులు నమోదు. జూన్ నెలలో 4 లక్షల కేసులు,12 వేలకు పైగా మరణాలు. దేశవ్యాప్తంగా ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు,18 వేలకు చేరువలో మరణాలు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 19,148 కేసులు, 434మంది మృతి. దేశవ్యాప్తంగా 6,04,641 కేసులు,17,834 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,26,947 యాక్టీవ్ కేసులు, 3,59,860 మంది డిశ్చార్జ్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విజయవాడ: కోవిడ్ ఆసుపత్రి నుంచి వసంతరావు అనే వృద్దుడు అదృశ్యం. వారం అయినా ఆచూకీ లభించక పోవడంతో ఆందోళనలో కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వసంతరావు అదృశ్యం అయ్యాడంటున్న కుటుంబ సభ్యులు.
  • అమరావతి: హైకోర్టు ను ఆశ్రయించిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. తనని హాస్పిటల్ కి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం. రేపు విచారించనున్న న్యాయస్థానం.
  • యూపీ ఢిల్లీ హర్యానా ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించనున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. కరోనా మహమ్మారిపై సమీక్ష.
  • మేడ్చల్ జిల్లాల ఇస్మాయిల్ ఖాన్ గూడా లో దారుణం. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్ గూడ విహారి హోమ్స్ లో అధ్య అనే ఆరేళ్ళ బాలికను అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన కరుణాకర్ అనే వ్యక్తి.
  • గుంటూరు జిల్లా: నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ముప్పాళ్ల si జగదీష్ మోసం చేశాడని మహిళ పిర్యాదు. నాకు ఎలాంటి సంబంధం లేదన్న si జగదీష్. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న సింధు. ఎస్సై జగదష్ తో పరిచయం. పెళ్ళి చేసుకుంటానని ఎస్సై మోసం చేశాడని ఆరోపిస్తున్న సింధు. సింధు ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు.
  • అమరావతి: రేపు ఢిల్లీకి వెళ్లనున్న వైసిపి ఎంపీలు. స్పీకర్ ను కలిసి రఘురామ కృష్ణంరాజు పై అనర్హత పిటిషన్ ఇచ్చే అవకాశం . రఘురామ కృష్ణంరాజు పై సీరియస్ గా వ్యవహరించాలని నిర్ణయించిన వైసిపి.

నాడు ప్రపంచకప్ ఫైనల్.. నేడు యాషెస్.. ‘కింగ్’ బెన్ స్టోక్స్

Ben Stokes Wins England In One Wicket Thriller Ashes 2019, నాడు ప్రపంచకప్ ఫైనల్.. నేడు యాషెస్.. ‘కింగ్’ బెన్ స్టోక్స్

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లోని మూడో టెస్ట్‌లో ఇంగ్లాండ్ అద్భుత విజయం సాధించింది. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలోనే ఇదో చిరస్మరణీయ విజయమని చెప్పవచ్చు. ఇటీవల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఒంటరి పోరాటం చేసి తన జట్టుకు కప్పును ముద్దాడేలా చేసిన బెన్ స్టోక్స్.. నేడు యాషెస్ మూడో టెస్ట్‌లో కూడా అద్భుతమైన ఇన్నింగ్స్(135*) ఆడి ఇంగ్లాండ్‌కు సంచలన విజయాన్ని అందించాడు. ఆసీస్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 362 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ జో రూట్(77), జో డెన్‌లీ(50), బెయిర్‌ స్టో(36)లు రాణించారు. అయితే వరుస వికెట్లు పడగొట్టి ఆసీస్ ఓ దశలో ఆధిపత్యంలో వచ్చినా.. స్టోక్స్ ఒక్కడే నిలబడి ఆర్చర్‌(15) సాయంతో పరుగులు రాబట్టాడు. అయితే ఆర్చర్‌ ఔట్‌ కావడంతో ఇంగ్లాండ్ ఓటమి తప్పదని అందరూ అనుకున్నారు. కానీ బెన్ స్టోక్స్ పట్టుదలతో ఒక ఎండ్‌లో జాక్‌ లీచ్‌(1*)ను కాపాడుకుంటూ బ్యాట్ ఝుళిపించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌వుడ్‌ 4, లియోన్‌ 2, కమిన్స్‌, పాటిన్సన్‌ చెరో వికెట్‌ తీశారు. మ్యాన్ అఫ్ అది మ్యాచ్ బెన్ స్టోక్స్‌కు లభించగా.. నాలుగో టెస్ట్‌ మాంచెస్టర్‌ వేదికగా వచ్చే నెల నాలుగో తేదీ ప్రారంభమవుతుంది.

Related Tags