వారెవ్వా స్మిత్.. రీఎంట్రీ అదిరింది!

బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్న ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌ మొదటి టెస్ట్‌లో రెండో సెంచరీ చేసి సత్తా చాటకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇక ఈ శతకంతో యాషెస్‌లో 10 కంటే ఎక్కువ సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్మిత్‌కు ఇది 25వ శతకం కాగా.. […]

వారెవ్వా స్మిత్.. రీఎంట్రీ అదిరింది!
Follow us

|

Updated on: Aug 05, 2019 | 1:15 AM

బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్న ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌ మొదటి టెస్ట్‌లో రెండో సెంచరీ చేసి సత్తా చాటకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇక ఈ శతకంతో యాషెస్‌లో 10 కంటే ఎక్కువ సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్మిత్‌కు ఇది 25వ శతకం కాగా.. విరాట్ కోహ్లీ రికార్డును తుడిచేసి.. అతి తక్కువ ఇన్నింగ్స్(119)లో ఈ ఘనత అందుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు.

ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ 68 ఇన్నింగ్స్‌లో 25 శతకాలు సాధించి అగ్రస్థానంలో నిలవగా.. విరాట్ కోహ్లీ 127 ఇన్నింగ్స్‌లో.. సచిన్ టెండూల్కర్ 130 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించారు. అటు ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నా స్టీవ్ స్మిత్.. వరుసగా రెండు సెంచరీలు చేసి టెస్ట్‌ల్లో నెంబర్ వన్ స్థానంపై మరోసారి కన్నేశాడని చెప్పాలి.