GHMC Elections: ఆయనొక్కరే ఆపని చేయగలరు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఒవైసీ..

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలుత ఎంఐఎం 44 సీట్లు గెలుచుకోవడం..

GHMC Elections: ఆయనొక్కరే ఆపని చేయగలరు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఒవైసీ..
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 05, 2020 | 12:15 PM

GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలుత ఎంఐఎం 44 సీట్లు గెలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, బీజేపీ ఎదుగుదలపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చాలా బలమైన నేతగా అభివర్ణించారు. అంతేకాదు.. దక్షిణ భారతదేశంలోనే భవిష్యత్తు ఉన్న నాయకుడు అని కొనియాడారు. కేసీఆర్‌ను తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నానని, బీజేపీని ఎదుర్కొనగలిగే సమర్థ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆయన మంచి పాలన సాగిస్తున్నారని ప్రశంసించిన ఒవైసీ.. కొన్ని సీట్లు పోయినంత మాత్రాన రాజకీయంగా ఆలోచించాల్సిన అవసరం లేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సాధారణ ఎన్నికల నాటికి ఈ పరిస్థితి ఉండదని జోస్యం చెప్పారు. బీజేపీని తెలంగాణ ప్రజానికం తప్పక అడ్డుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో మేయర్ పదవికి మద్దుతుపైనా అసదుద్దీన్ స్పందించారు. తక్కువ సీట్లలో పోటీ చేసినప్పటికీ 44 సీట్లను నిలబెట్టుకున్నామని సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక, మద్దతు అంశంపై నేడు నిర్ణయం తీసుకుంటామని ఒవైసీ ప్రకటించారు. దీనికి సంబంధించి పార్టీ నేతలతో చర్చిస్తామన్నారు. కాగా, 51 డివిజన్లలో పోటీ చేసిన ఎంఐఎం 44 చోట్ల విజయకేతనం ఎగురువేసిన విషయం తెలిసిందే. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ 55 స్థానాలు, బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 2 చోట్ల గెలిచింది. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మేయర్ పీఠం ఎక్కేదెవరు అనేదానిపై సందిగ్ధత నెలకొంది.

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు