Breaking News
  • మహబూబ్‌నగర్‌లో టెండర్‌ ఓటు నమోదు. 41వ వార్డులో 198వ పోలింగ్‌ కేంద్రంలో టెండర్‌ ఓటు నమోదు. ఘటనపై జిల్లా ఎన్నికల అధికారుల ఆగ్రహం. ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు. రీపోలింగ్‌ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం.
  • ల్యాండ్‌ పూలింగ్‌ సమయంలో చంద్రబాబు అనుచరులు భూములు కొన్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి-అంబటి. చట్టప్రకారం వాళ్లమీద యాక్షన్‌ తీసుకుంటాం-అంబటి. లోకేష్‌, చంద్రబాబు తాబేదారులు భూములు కొన్నారు-అంబటి.
  • కడప: ప్రొద్దుటూరులో ముగ్గురు క్రికెట్‌ బుకీల అరెస్ట్‌. రూ.2,68 లక్షలు స్వాధీనం.
  • ఏపీ హైకోర్టులో ఉత్కంఠ. సీఆర్‌డీఏ రద్దు, రాజధాని తరలింపు పిటిషన్ల కీలక విచారణ. వాదోపవాదాలు తెలుసుకోవటం కోసం వచ్చిన.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న.. మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహిత్గి.
  • ఎవరైనా చట్టాలకు లోబడే పనిచేయాలి. మండలిలో జరిగేది ప్రజలకు తెలియకూడదనే ప్రసారాలు నిలిపేశారు. మండలిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టం ప్రకారమే నడవాలి. మండలి చైర్మన్‌కు అధికార పార్టీ నేతలు నరకం చూపించారు. బిల్లును హడావుడిగా ఆమోదించుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు. బెయిల్‌పై ఉన్న విజయసాయిరెడ్డికి కౌన్సిల్‌లో ఏం పని. -ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, దీపక్‌, బచ్చులఅర్జునుడు, సత్యనారాయణరాజు.

హైదరాబాద్ ముస్లింలపై మమత కామెంట్.. అసదుద్దీన్ ఏమన్నారంటే ?

asaduddin mamata war of words, హైదరాబాద్ ముస్లింలపై మమత కామెంట్.. అసదుద్దీన్ ఏమన్నారంటే ?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ.. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మధ్య మాటల యుద్దం చరమాంకానికి చేరుతోంది. మైనారిటీ ఉగ్రవాదానికి కొన్ని పార్టీలు కొమ్ము కాస్తున్నాయంటూ, వారి మూలాలు హైదరాబాద్‌లో వున్నాయంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయ దుమారానికి దారి తీశాయి. దీదీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సీనియర్ ఓవైసీ.. బెంగాల్‌లో మైనారిటీల పరిస్థితి దారుణంగా వుందని, ముందు ఆ సంగతి చూసుకోవాలని మమతకు వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అసలు వీరిద్దరికి ఎక్కడ చెడింది అన్న చర్చ మొదలైంది.

బిజెపికి బద్ద వ్యతిరేకి అయిన మమతా బెనర్జీ.. తరచూ మైనారిటీల సంక్షేమంపై మాట్లాడుతూ వుంటారు. అయితే.. అమె ఉన్నట్లుండి దేశంలో మైనారిటీ ఉగ్రవాదం పెరిగిపోతోందంటూ సోమవారం ఘాటైన కామెంట్లు చేశారు. సోమవారం ఆమె కూచ్ బిహార్ ప్రాంతంలో పర్యటించారు. పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడారు. మైనారిటీలలో కొందరు ఉగ్రవాదం వైపు మొగ్గుచూపుతున్నారంటూ వారి మూలాలు హైదరాబాద్‌లో వున్నాయని చెప్పుకొచ్చారు దీదీ. హైదరాబాద్ మూలాలున్న వారు చెప్పే మాటలు వినొద్దని పార్టీ శ్రేణుల ద్వారా బెంగాల్‌లోని ముస్లింలకు దీదీ పిలుపునిచ్చారు. కూచ్ బీహార్ ప్రాంతంలోని హిందువులు బిజెపి వైపు మొగ్గుచూపుతున్నారన్న సంకేతాల నేపథ్యంలోనే మమతా బెనర్జీ మైనారిటీ ఉగ్రవాదం పేరిట కామెంట్లు చేశారని భావిస్తున్నారు.

అయితే.. దీదీ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పలు మాధ్యమాల ద్వారా స్పందించారు. బెంగాల్‌లో ముస్లిం మైనారిటీల దుస్థితిని పట్టించుకోని మమతాబెనర్జీ, మైనారిటీ ఉగ్రవాదం గురించి మాట్లాడడం విడ్డూరంగా వుందని అసద్ కామెంట్ చేశారు. ట్విట్టర్ వేదికగా అసదుద్దీన్ మమతకు ధీటైన సమాధానమిచ్చారు. ఒకవేళ హైదరాబాదీ ముస్లింల గురించి మమత మాట్లాడి వుంటే.. మరి బెంగాల్‌లో బిజెపికి 18 ఎంపీ సీట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు అసదుద్దీన్. తృణమూల్ కంచుకోట బెంగాల్.. బిజెపికి చేజారుతున్న తరుణంలో దీదీ పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని అసదుద్దీన్ అన్నారు.

మొత్తానికి మమతా బెనర్జీ, అసదుద్దీన్‌ల మాటల యుద్దం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. హైదరాబాద్ దాటి మహారాష్ట్ర మీదుగా బీహార్ దాకా విస్తరించిన ఎంఐఎం పార్టీ.. త్వరలో బెంగాల్ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతోంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించినట్లే బెంగాల్‌లోను మైనారిటీ ఓట్లను ఎంఐఎం చీల్చే అవకాశాలు కనిపించడం వల్లనే మమతా బెనర్జీ.. ఎంఐఎం పార్టీ లక్ష్యంగా మైనారిటీ ఉగ్రవాదం కామెంట్లను చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.