ముంబైకి అమిత్‌ షా.. “మహా” పంచాయితీ తేలనుందా..?

ఇటీవల వెలువడిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ఇబ్బందిగా మారాయి. అందుకు కారణం రెండు చోట్ల స్పష్టమైన మెజార్టీ రాకపోవడం. అయితే హర్యానాలో ఒంటరిగా పోటీ చేసి.. ఎక్కువ సీట్లు గెలుచుకున్నా.. విజయానికి మరో అయిదు అడుగు దూరంలో ఆగిపోయింది. అయితే అగ్రనేతల చొరవతో.. మరోపార్టీ జేజేపీ మద్దతులో మరోసారి అధికార పీఠమెక్కి.. కథ ముగించేసింది. అయితే అసలు కథ ఇప్పుడు మహారాష్ట్రలో మొదలైంది. ఫలితాలు వెలువడి అయిదు రోజులు గడుస్తున్నా.. ఇంకా అధికార పీఠమెక్కడంపై […]

ముంబైకి అమిత్‌ షా.. మహా పంచాయితీ తేలనుందా..?
Follow us

| Edited By:

Updated on: Oct 28, 2019 | 6:43 AM

ఇటీవల వెలువడిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ఇబ్బందిగా మారాయి. అందుకు కారణం రెండు చోట్ల స్పష్టమైన మెజార్టీ రాకపోవడం. అయితే హర్యానాలో ఒంటరిగా పోటీ చేసి.. ఎక్కువ సీట్లు గెలుచుకున్నా.. విజయానికి మరో అయిదు అడుగు దూరంలో ఆగిపోయింది. అయితే అగ్రనేతల చొరవతో.. మరోపార్టీ జేజేపీ మద్దతులో మరోసారి అధికార పీఠమెక్కి.. కథ ముగించేసింది.

అయితే అసలు కథ ఇప్పుడు మహారాష్ట్రలో మొదలైంది. ఫలితాలు వెలువడి అయిదు రోజులు గడుస్తున్నా.. ఇంకా అధికార పీఠమెక్కడంపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. బీజేపీ, శివసేనా కలిసి పోటీ చేసి.. అధికారం చేపట్టేందుకు సరిపడా సీట్లను గెలుచుకున్నారు. అయితే ఎక్కువ సీట్లు వచ్చినందున తామే సీఎం పగ్గాలు చేపడతామని బీజేపీ స్పష్టంచేస్తోంది. మరోవైపు ముందుగా అనుకున్న ప్రకారం సీఎం పదవిని పంచుకోవాల్సిందేనంటూ శివసేనా తెగేసి చెబుతోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర రాజకీయం ఎటూ తేలడం లేదు. మరోవైపు శివసేనా నేతల వ్యాఖ్యలు చూస్తుంటే.. అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారం చేపట్టేందుకు అటు ఎన్సీపీ, కాంగ్రెస్‌లు కూడా శివసేనా వైపు చూపులు చూస్తోంది. ఈ నేపథ్యంలోనే శివసేనా అధికార పత్రికలో వచ్చిన ఓ కార్టూన్.. సందిగ్ధంలో పడేసింది. ఇదిలా ఉంటే.. శివసేనా పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అధికారం తాలూకు రిమోట్ శివసేన చేతుల్లోనే ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవిని చెరి రెండేళ్ల పంచుకునేలా బీజేపీ రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో అక్టోబరు 30న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ముంబై రానున్నారు. అదే రోజు జరగనున్న బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఆయన కేవలం బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశానికి మాత్రమే పరిమితమవుతారా..? లేదంటే శివసేనతో కూడా చర్చలు జరుపుతారా? అన్నది తెలియాల్సి ఉంది. 50-50 ఫార్ములాను అమలు చేయాల్సిందేనని శివసేన పట్టబట్టుతున్న నేపథ్యంలో.. ఉద్ధవ్ థాక్రేతో అమిత్ షా చర్చలు జరిపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మిత్రుల పంచాయితీ, ప్రభుత్వ ఏర్పాటుకి సంబంధించి అదే రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

మరోవైపు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి శివసేన మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత రామ్‌దాస్ అథావలే సూచించారు. అంతేకాదు సీఎం పదవి చెరి రెండున్నరేళ్లు పాలించాలనే ఫార్ములాను బీజేపీ ఒప్పుకోకపోవచ్చన్నారు. అంతేకాదు.. సీఎం పదవి కాకుండా.. ఆదిత్య థాకరేను అయిదేళ్ల పాటు డిప్యూటీ సీఎం చేయాలని, శివసేన దీన్ని అంగీకరించాలని అథావలే సలహా ఇచ్చారు. మరి రామ్‌దాస్ అథావలే సలహాలను శివసేన స్వీకరిస్తుందో లేదో వేచి చూడాలి.