దేశవ్యాప్తంగా 548 మంది వైద్య సిబ్బందికి కరోనా..

కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణాలో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 548 వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందికి కరోనా వైరస్

దేశవ్యాప్తంగా 548 మంది వైద్య సిబ్బందికి కరోనా..
Follow us

| Edited By:

Updated on: May 06, 2020 | 5:45 PM

Coronavirus in India: కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణాలో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 548 వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందికి కరోనా వైరస్‌ సోకింది. వీరికి వైరస్‌ ఎలా సోకిందో ఇంకా తెలియలేదని అధికారులు అంటున్నారు. వీరంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఆస్పత్రి సిబ్బందే కావడం గమనార్హం.

కాగా.. కోవిద్-19 ఆస్పత్రుల్లో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బంది, వార్డు బాయ్స్‌, పారిశుద్ధ్య కార్మికులు, భద్రతా సిబ్బంది, ప్రయోగశాల సహాయకులు, ఫ్యూన్లు, వస్త్రాలు శుభ్రం చేసేవారు, వంటచేసే సిబ్బంది ఈ లెక్కల్లో లేరని అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోనే ఎక్కువ మంది వైద్యసిబ్బందికి కొవిడ్‌-19 సోకింది. ‘ఎవరి వల్ల, ఎలా, ఎవరి ద్వారా సోకిందో ఇంకా దర్యాప్తు చేయలేదు. ఢిల్లీలోనే 69 మంది వైద్యులకు కొవిడ్‌-19 సోకింది. వీరే కాకుండా 274 మంది నర్సులు, పారామెడికల్‌ సిబ్బందీ ఈ జాబితాలో ఉన్నారు’ అని అధికారులు వెల్లడించారు.

మరోవైపు.. సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో ఏడుగురు రెసిడెంట్‌ డాక్టర్లు, ఒక ప్రొఫెసర్‌ సహా 13 మందికి కొవిడ్‌-19 సోకింది. ఎయిమ్స్‌లో 10 మంది వైద్యసిబ్బందికి కరోనా వచ్చింది. వీరే కాకుండా ఢిల్లీలోని చాలా ఆస్పత్రుల్లో బాధితులు ఉన్నారు. కాగా దేశవ్యాప్తంగా 49,391 మందికి వైరస్‌ సోకగా 1,694 మంది మృతిచెందారు.