చెన్నైలో తీవ్ర నీటి కరువు!

దక్షిణాది రాష్ట్రాలలోని అన్ని రిజర్వాయర్లలోనూ నీటి మట్టాలు ఇప్పటికే కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ రాష్ట్రాలలో తమిళనాడు పరిస్థితి మరింత అద్వానంగా ఉంది. తమిళనాడు లోని జలాశయాలలో నీటి మట్టాలు సాధారణం కన్నా 99 శాతం తక్కువగా ఉన్నాయి. కేంద్ర వాటర్ కమిషన్ (సీడబ్ల్యుసి) గణాంకాల ప్రకారం తమిళనాడు తరువాత ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. దాదాపు 48 శాతం నీటి కొరతతో ఏపీ కరవు ముంగిట నిలిచింది. కర్నాటక కేరళ జలాశయాల్లో సాధారణం […]

చెన్నైలో తీవ్ర నీటి కరువు!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 28, 2019 | 8:06 PM

దక్షిణాది రాష్ట్రాలలోని అన్ని రిజర్వాయర్లలోనూ నీటి మట్టాలు ఇప్పటికే కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ రాష్ట్రాలలో తమిళనాడు పరిస్థితి మరింత అద్వానంగా ఉంది. తమిళనాడు లోని జలాశయాలలో నీటి మట్టాలు సాధారణం కన్నా 99 శాతం తక్కువగా ఉన్నాయి. కేంద్ర వాటర్ కమిషన్ (సీడబ్ల్యుసి) గణాంకాల ప్రకారం తమిళనాడు తరువాత ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. దాదాపు 48 శాతం నీటి కొరతతో ఏపీ కరవు ముంగిట నిలిచింది. కర్నాటక కేరళ జలాశయాల్లో సాధారణం కన్నా 37శాతం తక్కువగా నీటి నిల్వలు ఉన్నాయి.

చెన్నై మెట్రో వాటర్ విభాగం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. నీటి సరఫరా సక్రమంగా జరగడానికి చెన్నై నగరాన్ని 15 జోన్లుగా విభజించారు. ‘ఈ ప్రాంతంలో దాదాపు 800 కుటుంబాలు జీవిస్తున్నాయి. కేవలం మూడు లారీ ట్యాంకర్ల నీళ్లు వస్తాయి. వాటిలో ఒక ట్యాంకర్‌ ఉచితంగా ఇస్తారు. మరో రెండు ట్యాంకర్లకు డబ్బులు చెల్లించాలి. ఆ కొద్ది పాటి నీళ్లు మాకు సరిపోవు. ఉచితంగా మరింత నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. నీటి కోసం పగలూ రాత్రి కష్టపడుతున్నాం. అటు ఇంటి పనులు, ఇటు పిల్లల్ని చూసుకుంటూ నీళ్ల కోసం వెళ్లాలంటే చాలా కష్టంగా ఉంటుంది. బయటకెళ్లి పని చేస్తేనే పూట గడుస్తుంది. కానీ నీటి కొరత మమ్మల్ని ఏ పనికి వెళ్లనివ్వడం లేదు” అని మరో వ్యక్తి  అన్నారు. చెన్నై మెట్రో ప్రతిరోజూ 9వేల లారీ ట్యాంకర్లతో 52.5 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తుంది.

తమిళనాడుకు నాలుగు ప్రాధమిక జలాశయాల నుండి నీరు లభిస్తుంది. కానీ ఈ రిజర్వాయర్లలో నీటి మట్టాలు ఇప్పటికే కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఆదివారం నాటికి, రెడ్ హిల్స్, పూండి, చోలవరం మరియు చెమ్బరంబాక్కం వద్ద నాలుగు రిజర్వాయర్లలో మొత్తం నిల్వ స్థాయి కేవలం 58 mcft (మిలియన్ క్యూబిక్ అడుగులు) – వాటి మిళిత సామర్థ్యం కంటే తక్కువగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో, నాలుగు జలాశయాలు 2.8 టిఎంసిల (వేల మిలియన్ క్యూబిక్ అడుగుల) నీటిని కలిగివున్నాయి.

చెన్నైలో ఇంకిపోతున్న జలవనరులపై నగర మెట్రో వాటర్ సప్లయ్ అండ్ సేవరేజ్ బోర్డు సీనియర్ అధికారి మాట్లాడుతూ.. చెన్నై నగర రిజర్వాయర్లు ప్రమాద స్థాయికి అడుగంటిపోతున్నాయి. వీరనం చెరువులో నీటిమట్టం స్థాయి బాగానే ఉందన్నారు. ఈ చెరువు నుండి 180 ఎంఎల్ డీ నీటిని సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. నగరంలో ప్రస్తుతం పీక్ సీజన్ లో 830ఎంఎల్ డీ వరకు నీటి అవసరం అవుతోంది. దీన్ని బోర్డు 550ఎంఎల్ డీ (రోజుకు మిలియన్ లీటర్ల నీళ్లు) కి తగ్గించింది. రానున్న రోజుల్లో 500ఎంఎల్ డీ వరకు తగ్గించే యోచనలో ఉన్నట్టు తెలిపారు. చెన్నైలో నీటి కొరత అంత అధ్వానంగా లేదన్నారు. వర్షంపై ఆధారపడకుండా.. ప్రస్తుతం నగరంలో 480 ఎంఎల్ డీ నీటిని సరఫరా చేస్తున్నట్టు చెప్పారు.

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ