కేజ్రీతో ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు.. రీజన్ ఏంటో చూడండి

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఆయన అందరికీ మఫ్లర్‌తో సుపరిచితుడు. ఢిల్లీలో చలితీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడి వారు ఎక్కువ మంది మఫ్లర్లను ఉపయోగిస్తారు. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా.. ఈ మఫ్లర్లనే ఉపయోగిస్తుండేవారు. అయితే గతకొద్ది రోజుల నుంచి ఢిల్లీలో చలి తీవ్రత విపరీతంగా ఉన్నా.. కేజ్రీవాల్ మాత్రం మఫ్లర్లను ఉపయోగించేడం లేదు. ఈ సంగతిని గుర్తించిన కొందరు.. […]

కేజ్రీతో ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు.. రీజన్ ఏంటో చూడండి
Follow us

| Edited By:

Updated on: Dec 27, 2019 | 4:46 PM

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఆయన అందరికీ మఫ్లర్‌తో సుపరిచితుడు. ఢిల్లీలో చలితీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడి వారు ఎక్కువ మంది మఫ్లర్లను ఉపయోగిస్తారు. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా.. ఈ మఫ్లర్లనే ఉపయోగిస్తుండేవారు. అయితే గతకొద్ది రోజుల నుంచి ఢిల్లీలో చలి తీవ్రత విపరీతంగా ఉన్నా.. కేజ్రీవాల్ మాత్రం మఫ్లర్లను ఉపయోగించేడం లేదు. ఈ సంగతిని గుర్తించిన కొందరు.. అసలు విషయాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. అంతే వెంటనే ఓ నెటిజన్.. నేరుగా సీఎం కేజ్రీవాల్‌ను.. మఫ్లర్ ఎందుకు ఉపయోగించడం లేదంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ” చలికాలం ప్రారంభమైనా.. ఈసారి ఇంకా మఫ్లర్ ఉపయోగించడం (బయటకు తీయలేదు) లేదేంటి..? చలి కూడా విపరీతంగా ఉంది.. ఏమైందంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు” అంటూ ఓ యువకుడు కేజ్రీవాల్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఆ పోస్టుకు మఫ్లర్ మ్యాన్ అంటూ హ్యాష్ ట్యాగ్ తగిలించాడు. అంతే.. ఇక ఆ ట్వీట్ కాస్త వైరల్‌గా మారింది.

కాగా, ఈ ట్వీట్‌పై కేజ్రీవాల్‌ తనదైన శైలిలో స్పందించారు. ‘మఫ్లర్‌ ఎప్పుడో బయటికి వచ్చింది. కానీ మీరే గమనించలేదు. అసలే చలి తీవ్రత ఎక్కువైంది. అంతా జాగ్రత్తలు తీసుకొండి’ అని నవ్వుకుంటూ.. సదరు యువకుడికి రిప్లై ఇచ్చారు.