Breaking News
  • ఆదిలాబాద్‌: నేటి నుంచి నాగోబా జాతర. ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌లో ప్రారంభంకానున్న జాతర. జాతరకు రానున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఆదివాసీలు, గిరిజనులు.
  • అవినీతి సూచిలో భారత్‌కు 80వ స్థానం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై వ్యాపారవర్గాలు నుంచి.. వివరాలు సేకరించిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ. అవినీతి కట్టడిలో తొలిస్థానంలో నిలిచిన డెన్మార్క్‌, న్యూజిలాండ్‌.
  • వలసల నియంత్రణకు ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక చర్య. అమెరికా వచ్చే విదేశీ గర్భిణులపై ఆంక్షలు విధింపు. కాన్పు కోసమే అమెరికా వచ్చేవారికి పర్యాటక వీసా నిరాకరణ.
  • రోహింగ్యాల ఊచకోతపై అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పు. మయన్మార్‌లో రోహింగ్యాల నరమేధం జరిగింది. సైన్యం అండతో రోహింగ్యాలను ఊచకోత కోశారన్న న్యాయస్థానం. రోహింగ్యాలను రక్షించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం.
  • కరోనా వైరస్‌కు కారణం పాములే. చైనా అధ్యయనంలో వెల్లడి. ఐదు నగరాలకు రాకపోకలన్నీ నిలిపివేసిన చైనా. వుహాన్‌, హుయాంగ్‌గాంగ్‌, ఎఝౌ, ఝిజియాంగ్‌.. ఖియాన్‌జింగ్‌ నగరాలపై రవాణా ఆంక్షలు విధింపు.

సీఎం సాహసం..మంచుకొండల్లో ఏం చేశాడంటే?

cm dareful driving in ghat section, సీఎం సాహసం..మంచుకొండల్లో ఏం చేశాడంటే?

తమ తమ రాష్ట్రాల్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రయత్నాలు చేస్తూనే వుంటాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలుత చంద్రబాబు, ఆ తర్వాత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు పర్యటక రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రతీ ఒక్కరికి తెలిసిందే. కానీ ఇపుడు ఓ ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతోపాటు.. యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించేందుకు చేస్తున్న కృషి, తీసుకుంటున్న రిస్క్ మాత్రం అంతా ఇంతా కాదు.

అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో టూరిజంను ప్రోత్సహించేందుకు రాష్ట్ర సీఎం పెమా ఖండూ స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవల ఘాట్ రోడ్డులో బైక్ మీద ఒంటరిగా 122 కి.మీ.లు ప్రయాణం చేసిన పెమా ఖండూ.. తాజాగా మరో పీట్‌లో సంచలనం సృష్టించారు. 15 వేల 600 అడుగుల ఎత్తులో, మంచుకొండల్లో 107 కి.మీ.లు స్వయంగా ఆల్ టెరైన్ వాహనాన్ని నడిపారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా ఈ రైడ్‌లో పాల్గొనడం విశేషం.

ఇండో-టిబెట్ సరిహద్దుకు సమీపంలో చైనా బోర్డర్‌కు అత్యంత దగ్గరగా వుండే తవాంగ్ జిల్లాలో పీటీఎస్వో లేక్ నుంచి మాంగో ఏరియా వరకు ఏటీవీని 107 కిలోమీటర్ల దూరం సీఎం పెమా ఖండూ నడుపుకుంటూ వెళ్ళారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆయన స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. సాహసోపేతమైన ఈ రైడ్ తర్వాత సరిహద్దులోని జవాన్లతో పెమా ఖండూ, కిరణ్ రిజిజు దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు.

cm dareful driving in ghat section, సీఎం సాహసం..మంచుకొండల్లో ఏం చేశాడంటే?ఈ యాత్రలో పెమా ఖండూతోపాటు పాల్గొన్న కేంద్ర మంత్రి రిజిజు అయితే.. ఖండూ సాహసాన్ని సోషల్ మీడియాలో తెగ పొగిడేస్తున్నారు. అత్యంత కఠినమైన రైడ్‌ను పెమా ఖండూ అత్యంత వేగంగా, ఉత్సాహంగా నడిపారు. ఆయన పక్కన తాను నమ్మకంగా కూర్చున్నానని కిరణ్ రిజిజు పేర్కొన్నారు.

cm dareful driving in ghat section, సీఎం సాహసం..మంచుకొండల్లో ఏం చేశాడంటే?