జైట్లీతో పీయూష్ ఢీ.. ఆర్ధిక శాఖ ఎవరిది.?

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అన్ని మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కాబోతున్నాడని స్పష్టం చేయడంతో గెలుపు ధీమాతో ఉన్న బీజేపీ.. మంత్రివర్గంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు కీలకమైన ఆర్ధిక శాఖను ఈసారి ఎవరికి కేటాయిస్తారన్నది పార్టీ వర్గాల్లో  చర్చనీయాంశం అయింది. ఇటీవల జైట్లీ స్థానంలో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన పీయూష్‌కు ఆర్ధిక శాఖ ఇస్తారని కొంతమంది పార్టీ నేతలంటున్నారు. ఇకపోతే మోదీ కేబినేట్‌లో సీనియర్ అయిన అరుణ్ జైట్లీ గతంలో ఆర్ధిక మంత్రిగా ఉన్నారు. కానీ […]

జైట్లీతో పీయూష్ ఢీ.. ఆర్ధిక శాఖ ఎవరిది.?
Follow us

|

Updated on: May 22, 2019 | 1:49 PM

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అన్ని మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కాబోతున్నాడని స్పష్టం చేయడంతో గెలుపు ధీమాతో ఉన్న బీజేపీ.. మంత్రివర్గంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు కీలకమైన ఆర్ధిక శాఖను ఈసారి ఎవరికి కేటాయిస్తారన్నది పార్టీ వర్గాల్లో  చర్చనీయాంశం అయింది. ఇటీవల జైట్లీ స్థానంలో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన పీయూష్‌కు ఆర్ధిక శాఖ ఇస్తారని కొంతమంది పార్టీ నేతలంటున్నారు.

ఇకపోతే మోదీ కేబినేట్‌లో సీనియర్ అయిన అరుణ్ జైట్లీ గతంలో ఆర్ధిక మంత్రిగా ఉన్నారు. కానీ ఆయనకు ఇటీవల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన సమయంలో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆయన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. దీనితో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చిన పక్షంలో ఆర్ధిక మంత్రి పదవి విషయంలో జైట్లీ – పీయూష్ మధ్య పోటీ నెలకొనే సూచనలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా పార్టీ పెద్దలు మాత్రం ఈసారి కూడా అరుణ్ జైట్లీకే ఆర్ధిక శాఖ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఆరోగ్యం దృష్ట్యా  పీయూష్‌ వైపు కూడాకొందరు మొగ్గు చూపుతున్నారు. 2018లో ఆర్థిక వృద్ధి రేటు 6.6శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. అటు పెరుగుతున్న ఇంధన ధరలు ఆర్థిక వ్యవస్థకు సవాల్ గా మారాయి. ఇలాంటి సమయంలో ఆర్ధిక మంత్రిగా వీరిద్దరిలో ఎవరు బాధ్యతలను నిర్వర్తిస్తారో వేచి చూడాలి.