మరో అరుదైన గౌరవం దక్కించుకున్న రియల్ హీరో.. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఆర్స్ట్ అండ్ హ్యుమానిటీస్ విభాగానికి సోనూసూద్ పేరు

కరోనా సమయంలో పేదలపాలిట దైవంగా మారాడు నటుడు సోనూసూద్. వేలాది మంది వలస కార్మికులఅండగా నిలిచాడు.వలస కార్మికుల కోసం కోట్లు ఖర్చు చేసి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసిన సోనూ సూద్ రియల్ హీరో అయ్యాడు.

మరో అరుదైన గౌరవం దక్కించుకున్న రియల్ హీరో.. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఆర్స్ట్ అండ్ హ్యుమానిటీస్ విభాగానికి సోనూసూద్ పేరు
Follow us

|

Updated on: Dec 05, 2020 | 9:22 PM

కరోనా సమయంలో పేదలపాలిట దైవంగా మారాడు నటుడు సోనూసూద్. వలస కార్మికుల కోసం కోట్లు ఖర్చు చేసి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసిన సోనూ సూద్ రియల్ హీరో అయ్యాడు. దేశ వ్యాప్తంగా వేలాది మంది వలస కార్మికులను తమ తమ గమ్య స్థానాలకు చేర్చడంలో సోనూ సూద్ చేసిన సాయం అంతా ఇంతా కాదు. బస్సు.. రైళ్లు.. విమానం ఇలా ఎవరికి ఏది అవసరమో అది బుక్ చేసిమరి వారి గమ్య స్థానాలకు చేర్చాడు.

రీల్ లైఫ్ లో విలన్ గా నటించే సోనూ సూద్ రియల్ లైఫ్ లో జనాల పట్ల రియల్ హీరోగా మారాడు. కష్టాల్లో వున్నా ప్రతివారికి కాదనకుండా సహాయం చేసాడు.  సోనూసూద్ పై దేశంమొత్తం ప్రసంశలు కురిపించింది. ఐక్యరాజ్యసమితి కూడా సోనూ సూద్ కు పురస్కారాన్ని ప్రకటించింది.తాజాగా సోనూసూద్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ లోని శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ సోనూసూద్ కు అరుదైన పురస్కారాన్ని అందించారు. కాలేజీలోని ఆర్స్ట్ అండ్ హ్యుమానిటీస్ విభాగానికి సోనూ సూద్ పేరు పెట్టింది. సోనూసూద్ కాలేజ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ గా పేరుపెట్టినట్టు కాలేజీ యాజమాన్యం తెలిపింది. రాష్ట్రంలో ఎక్కువ మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను అందించిన కాలేజీగా ఘనత సాధించింది శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. కాలేజీ తీసుకున్న నిర్ణయంపై సోనూసూద్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. కాలేజీలోని ఆర్స్ట్ అండ్ హ్యుమానిటీస్ విభాగానికి తన పేరు పెట్టడం పెద్ద గౌరవంగా భావిస్తున్నట్లు సోనూసూద్ తెలిపారు