దేశం తలను నరికారు.. ఆజాద్ ఆగ్రహం

Article 370: NDA has cut off India's head says Ghulam Nabi Azad, దేశం తలను నరికారు..  ఆజాద్ ఆగ్రహం

ఇంతకాలం దేశానికి తలగా ఉన్న జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం ఇప్పుడు తల లేకుండా చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్. రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన ఆర్టికల్ 370 రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి జమ్మూ కశ్మీర్ తలగా ఉండేదని, ఇప్పుడు దాన్ని బీజేపీ ప్రభుత్వం నరికేసిందన్నారు. ఈ విధంగా  జరుగుతుందని కలలోకూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు బలగాలను దించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని, ఏదో జరిగిపోతుందనే విధంగా అలజడి సృష్టించారని మండిపడ్డారు ఆజాద్.  అయితే అక్కడ కాకుండా రాజ్యసభలో అమిత్‌షా బాంబు పేల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో ఎంతో కీలకమైన జమ్మూ కశ్మీర్ అంశానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చి ఒకేరోజులో పాస్ చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆజాద్.  ప్రభుత్వం తీసుకున్న  తాజా నిర్ణయంతో జమ్మూ కశ్మీర్‌లో ఏ మార్పులు తీసుకురానున్నారో చెప్పాలని ఆయన  డిమాండ్ చేశారు . పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో కొంత భాగం పాక్, మరికొంత భాగం చైనా ఆధీనంలో ఉందని, దాన్ని తీసుకురాగలరా అంటూ నిలదీశారు. చైనా బలగాల మీద యుద్ధం చేయగలరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జమ్మూకాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వల్ల కాశ్మీరీలకు ప్రత్యేకంగా ఒరిగేదేమీ ఉండదని ఆజాద్ అన్నారు.

ఆర్టికల్ 370 రద్దుపై రాజ్యసభలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్రస్ధాయిలో ఆరోపణలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *