Breaking News
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మ‌హేశ్‌. పుట్టిన‌రోజు ఇంత కంటే గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకోలేన‌ని ట్వీట్‌. తార‌క్‌, విజ‌య్‌, శృతిహాస‌న్‌ను నామినేట్ చేసిన‌ మ‌హేశ్‌. ఈ కార్య‌క్ర‌మం చెయిన్ కంటిన్యూ కావాల‌ని, స‌రిహ‌ద్దులు దాటాల‌ని కోరిన మ‌హేశ్‌. ప‌చ్చ‌ద‌నం వైపు అడుగులు వేద్దామ‌న్న మ‌హేశ్‌. ఎంపీ సంతోష్ కుమార్‌ను అభినందించిన మ‌హేశ్‌.
  • నిజామాబాద్ : ఎమ్మెల్సీ వీజీ గౌడ్​కు కరోనా పాజిటివ్​ . ఆయన భార్య, కుమారుడికి కూడా పాజిటివ్ నిర్ధారణ. నిమ్స్‌లో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వీజీ గౌడ్. హైద్రాబాద్ లో హోం క్వారంటైన్‌లో ఎమ్మెల్సీ కుటుంబం.
  • దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 64,399 కరోనా కొత్త కేసులు నమోదు. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 861 మంది మృతి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 21,53,011. యాక్టివ్ కేసుల సంఖ్య 6,28,747, కోలుకుని డిశ్చార్జైనవారు 14,80,885. కోవిడ్-19 మహమ్మారి కారణంగా చనిపోయినవారు 43,379 మంది.
  • విజయవాడ: ఐడెంటిఫికేషన్ పూర్తి.. స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వివరాలు... డోక్కు శివ బ్రహ్మయ్య, మచిలీపట్నం (58) పూర్ణ చంద్ర రావు.. మొవ్వ , సుంకర బాబు రావు ,సింగ్ నగర్ (రిటైర్డ్ ఎస్సై.) మజ్జి గోపి మచిలీపట్నం సువర్ణ లత పొన్నూరు, నిడుబ్రోలు వెంకట లక్ష్మి సువర్చలా దేవి,(జయ లక్ష్మి ) కందుకూరు పవన్ కుమార్ కందుకూరు..ఎం అబ్రహం.. చర్చి ఫాథర్...జగ్గయ్య పేట రాజకుమారి అబ్రహం జగ్గయ్యపేట రమేష్, విజయవాడ.
  • సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా వైద్య శాఖ సిబ్బంది, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీ, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లతో కోవిడ్ పై మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ లోని తన నివాసం నుంచిటెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
  • భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1గా నమోదు చైనాలోని తూర్పు షిజాంగ్ - భారత్ సరిహద్దుల్లో భూకంప కేంద్రం.

ఆర్టికల్ 370 రద్దుతో ఆర్థిక నష్టమెంతో తెలిస్తే షాక్..!

kashmir loses 10 thousand crores, ఆర్టికల్ 370 రద్దుతో ఆర్థిక నష్టమెంతో తెలిస్తే షాక్..!

దశాబ్ధాల కాలంగా భారత్‌కు పాకిస్తాన్ పక్కలో బల్లెంగా మారి.. తరచూ అంతర్జాతీయ వేదికలపై ఇరుకున పెట్టేందుకు వాడుకుంటున్న అంశం కశ్మీర్. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమైనా.. ఒక్క అధికరణం ప్రకారం దాన్ని వేరుగా చూసే ఛాన్స్ వుండడంతో దాన్ని ఆసరాగా తీసుకుని అటు అంతర్జాతీయ వేదికలపైనా.. ఇటు కశ్మీర్ యువకులపైనా తన విష ప్రయోగాన్ని తరచూ చేస్తూ వచ్చింది పాకిస్తాన్. దశాబ్ధాలపాటు పాక్ చేస్తున్న వికృత చర్యలను, విష ప్రయోగాలను అప్పటి కాంగ్రెస్, కాంగ్రెసేతర ప్రభుత్వాలు చేతలుడిగి చూడడం మినహా ఏమీ చేయలేకపోయాయి.

అంతర్జాతీయంగా ఏదో చేస్తున్నామన్న ఇంప్రెషన్ ఇవ్వడం మినహా గట్టి చర్యలకు గత ప్రభుత్వాలు ధైర్యం చేయలేకపోయాయి. కానీ.. నయా భారత్‌కు నేతృత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం కశ్మీర్ పట్ల మనదేశంలోను, విదేశాలల్లోను వున్న దృక్పథాన్ని పూర్తిగా మార్చి వేసింది.

తాత్కాలిక ఉపశమనం కోసం భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రూపొందించిన ఆర్టికల్ 370 రద్దు చేయాలన్న సాహసోపేత నిర్ణయం దేశంలోని రాజకీయ పార్టీలను ఖిన్నులను చేసింది. కొన్ని రోజుల పాటు కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు మోదీ ప్రభుత్వాన్ని తప్పు పట్టేందుకు ప్రయత్నించినా ఆ తర్వాత వారు మౌనం వహించాల్సిన పరిస్థితిని కల్పించాయి.

అయితే.. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంలో మోదీ సర్కార్ అత్యంత వ్యూహాత్మకంగాను.. అత్యంత రహస్యంగాను ముందుకెళ్ళింది అంటే కాదనే వారు లేరు. ఎందుకంటే మోదీకి అత్యంత నమ్మకస్తుడు జాతీయ భద్రతా మండలి చీఫ్ అజిత్ దోవల్ ఇచ్చిన ఇన్ పుట్స్.. వాటికి అనుగుణంగా తుది నిర్ణయం తీసుకునే ముందే పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకోవడ.. తరచూ రాళ్ల వానతో విరుచుకుపడే కశ్మీర్ యువతను కట్టడి చేయడం.. వారిని రెచ్చగొట్టే స్థానిక రాజకీయ పార్టీలు, వేర్పాటు వాద సంస్థల నాయకులను గృహ నిర్బంధంలో వుంచడం.. ఇలాంటి పక్కా ముందస్తు చర్యలతో ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన వంటి చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకున్నారు ప్రధాని మోదీ.

పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రసంగాలు యావత్ భారత ప్రజలను ఆకట్టుకోవడమే కాకుండా.. కశ్మీర్ విషయంలో శాశ్వత పరిష్కారం ఇదేనన్న భావన వచ్చేలా చేశాయి. కశ్మీర్‌లో అల్లర్లు చెలరేగకుండా దాదాపు రెండు నెలల పాటు పక్కా భద్రతా చర్యలు, పలువురు నేతల గృహ నిర్బంధాలు కొనసాగాయి. పలు సున్నిత ప్రాంతాల్లో రోజుల తరబడి కర్ఫ్యూ వాతావరణం ప్రతిబింభించింది.

kashmir loses 10 thousand crores, ఆర్టికల్ 370 రద్దుతో ఆర్థిక నష్టమెంతో తెలిస్తే షాక్..!

దుకాణాలు, స్కూళ్లు, కార్యాలయాలు వారాల తరబడి మూతబడ్డాయి. అయితే.. ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలను అందుబాటులో వుంచడంలో భద్రతాబలగాలు కూడా తమ చేయూతనందించడంతో కశ్మీర్‌లో చెప్పుకోదగిన అల్లర్లేవీ చెలరేగలేదు. అయితే.. ఇలా వారాల తరబడి వ్యాపారాలు మూతపడడం మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిందని తాజాగా ఆర్థిక వేత్తలు అంఛనా వేస్తున్నారు.

సుమారు రెండు నెలల కాలంలో కశ్మీర్ వ్యాప్తంగా పదివేల కోట్ల రూపాయల వ్యాపార నష్టం సంభవించిందని ఆర్థిక వేత్తలు అంఛనా వేస్తున్నారు. ఆగస్టు 5వ తేదీ మొదలుకుని.. అక్టోబర్ 26వ తేదీ వరకు మొత్తం 84 రోజుల పాటు కశ్మీర్ వ్యాప్తంగా వ్యాపారాలు అంతంత మాత్రంగానే నడిచాయని, ఫలితంగా పదివేల కోట్ల రూపాయల వ్యాపార (ఆర్థిక) నష్టం సంభవించిందని చెబుతున్నాయి. అయితే.. ఈ వివరాలన్నీ ఆర్థిక శాఖాధికారుల దగ్గర కూడా వున్నాయని, వారి సూచన మేరకు కశ్మీర్‌లో తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా వున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

kashmir loses 10 thousand crores, ఆర్టికల్ 370 రద్దుతో ఆర్థిక నష్టమెంతో తెలిస్తే షాక్..!

ముఖ్యంగా కశ్మీర్‌లోని పలు ప్రాంతాలలో టూరిజం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు కొత్తగా ఏర్పాటుకానున్న (అక్టోబర్ 31, 2019 నుంచి) కశ్మీర్, లద్ధాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల ఎకానమీలో ఒక్కసారిగా బూస్ట్ వస్తుందని అంఛనా వేస్తున్నారు. జరిగిన నష్టం తాత్కాలికమేనని.. మున్ముందు పరిస్థితి పూర్తిగా మారిపోతుందని అంటున్నారు.

Related Tags