డేటా చోరీ కేసులో దర్యాప్తు వేగవంతం.. అశోక్ కు అరెస్ట్ వారెంట్ జారీ

హైదరాబాద్ : డేటా చోరీ కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ కు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే విచారణకు హాజరు కావాలని కోర్టు నోటీసులు జారీ చేసినా… అశోక్ ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో 41 సీఆర్పీసీ కింద అశోక్ కు సిట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మరోవైపు, ఐటీ గ్రిడ్స్ ఉద్యోగులు ఇచ్చిన వివరాల […]

డేటా చోరీ కేసులో దర్యాప్తు వేగవంతం.. అశోక్ కు అరెస్ట్ వారెంట్ జారీ
Follow us

| Edited By:

Updated on: Mar 16, 2019 | 12:38 PM

హైదరాబాద్ : డేటా చోరీ కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ కు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే విచారణకు హాజరు కావాలని కోర్టు నోటీసులు జారీ చేసినా… అశోక్ ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో 41 సీఆర్పీసీ కింద అశోక్ కు సిట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మరోవైపు, ఐటీ గ్రిడ్స్ ఉద్యోగులు ఇచ్చిన వివరాల ఆధారంగా సిట్ విచారణ జరుపుతోంది. ఈ నెల 20న కోర్టుకు సిట్ అధికారులు నివేదిక ఇవ్వనున్నారు.