ఆ క్రికెటర్‌కు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీచేసిన కోర్టు!

టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. షమీకి, అతడి సోదరుడు హసీద్ అహ్మద్‌కు గృహహింస కేసులో వెస్ట్ బెంగాల్‌లోని అలిపోర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. 15 రోజుల లోపు కోర్టుముందు లొంగిపోవాలని స్పష్టం చేసింది. పలువురు అమ్మాయిలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భర్త, అతడి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని షమీ భార్య హసీన్ జహాన్ గతంలో కేసు పెట్టింది. గత ఏడాది ఐపీఎల్‌కు ముందు గృహహింస కేసు […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:05 pm, Mon, 2 September 19
Arrest warrant against Indian pacer Mohammed Shami

టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. షమీకి, అతడి సోదరుడు హసీద్ అహ్మద్‌కు గృహహింస కేసులో వెస్ట్ బెంగాల్‌లోని అలిపోర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. 15 రోజుల లోపు కోర్టుముందు లొంగిపోవాలని స్పష్టం చేసింది. పలువురు అమ్మాయిలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భర్త, అతడి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని షమీ భార్య హసీన్ జహాన్ గతంలో కేసు పెట్టింది. గత ఏడాది ఐపీఎల్‌కు ముందు గృహహింస కేసు కూడా పెట్టింది. దాంతో ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద కోల్ కతా పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు.

ఇక ఏప్రిల్‌లో అమ్రోహా(యూపీ)లోని షమీ ఇంటికి వెళ్లిన జహాన్..అత్తారింట్లో హంగామా చేసింది. షమీ తల్లిదండ్రులతో గొడవకు దిగింది. కూతురితో సహా వచ్చిన హసీన్ తనను తాను ఒక గదిలో నిర్బంధించుకుంది. షమి పేరెంట్స్ పోలీసులకు సమాచారం అందించడంతో ఆమెను అరెస్టు చేశారు. అనంతరం బెయిల్ పై విడుదల చేశారు. కాగా, ప్రస్తుతం వెస్టిండీస్‌లో ఉన్న షమి..వెస్టిండీస్-ఇండియా టెస్ట్ సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో అరెస్ట్ వారెంట్ జారీకావడం చర్చనీయాంశమైంది.