Breaking News
  • అమరావతి: చంద్రబాబును నమ్మి భూములిచ్చి దళిత రైతులు మోసపోయారు. మా ప్రభుత్వ నిర్ణయంతో దళిత రైతులకు న్యాయంజరిగింది-ఎమ్మెల్యే ఆర్కే. దళిత రైతుల భూములను చంద్రబాబు తనవారికి కారుచౌకగా ఇప్పించారు. రాజధాని ప్రాంతంలో బినామీలుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల చిట్టాను త్వరలో బయటపెడతాం-ఎమ్మెల్యే ఆర్కే.
  • ప్రకాశం జిల్లా: సింగరాయకొండ మండలం పాకల దగ్గర సముద్రంలో నలుగురు యువకుల గల్లంతు. ముగ్గురిని కాపాడిన మెరైన్‌ పోలీసులు. మరో యువకుడి కోసం కొనసాగుతున్న గాలింపు.
  • యానాంలో ప్రేమజంట అనుమానాస్పద మృతి. మృతులు కాట్రేనిపాడుకు చెందిన రమేష్‌. మలికిపురం మండలానికి చెందిన యువతిగా గుర్తింపు. పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ఈ నెల 9న ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమజంట. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 14 కిలోల బంగారం స్వాధీనం. అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.5.46 కోట్లు ఉంటుందని అంచనా.
  • అమరావతి: అసెంబ్లీకి వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకున్నారు-చంద్రబాబు. అమాయకులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ పెట్టి దాడులు చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఇంగ్లీష్‌ మీడియాన్ని వైసీపీ నేతలు వ్యతిరేకించారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తెచ్చి రెండు నాలుకలధోరణి అవలంబిస్తున్నారు కొత్త చీఫ్‌ మార్షల్‌ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు-చంద్రబాబు.
  • గుంటూరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైసీపీ నెరవేర్చలేదు. ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు-యరపతినేని. ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయి-మాజీ ఎమ్మెల్యే యరపతినేని. నియోజకవర్గ పరిధిలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. వైసీపీ కార్యకర్తలే ఇసుకను బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతున్నారు-మాజీ ఎమ్మెల్యే యరపతినేని.

రేపే బక్రీద్‌.. ఏర్పాట్లు పూర్తి

Arrangements For Bakrid Eid Complete in Telangana, రేపే బక్రీద్‌.. ఏర్పాట్లు పూర్తి

బలిదానానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ కోసం నగరంలోని ముస్లింలు సమాయత్తమవుతున్నారు. హిజ్రీ క్యాలెండర్‌ ప్రకారం జీల్‌ హీజ్జ మాసంలో బక్రీద్‌ పండుగను జరుపుకుంటామని మతపెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మేకలు, గొర్రెలను బలిఇచ్చే సాంప్రదాయాన్ని కొనసాగిస్తారని తెలిపారు. ఇక రేపే బక్రీద్‌ పండుగ కావడంతో పాతబస్తీ శివారు ప్రాంతాల్లో పొట్టేలు, మేకల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వ్యాపారులు తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుండి పొట్టేలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఇక రాష్ట్రవాప్తంగా బక్రీద్‌ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బక్రీద్‌ పండుగ సందర్భంగా పెద్ద జంతువులను ఖుర్బానీ చేయవద్దని మత పెద్దలు హుకూం జారీ చేశారు. మరోవైపు గోవులను అక్రమంగా ఎవరైనా తరలిస్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నగర కమిషనర్‌ తెలిపారు.