మూడు రోజులలో ఏడు ఖండాలు, 208 దేశాలు చుట్టొచ్చిన మహిళ, ఈ యాత్రతో పాత గిన్నిస్‌ రికార్డు చెరిగిపోయింది!

సాహిత్య అభిమానులకు జులెస్‌ వెర్న్‌ రాసిన అరౌండ్‌ ది వరల్డ్‌ 80 డేస్‌ అనే నవల గుర్తుంటే ఉంటుంది.. ఆ అడ్వెంచరస్‌ నవలను ముళ్లపూడి వెంకటరమణ 80 రోజులలో భూ ప్రదక్షణ పేరుతో తెలుగులో అనువదించారు కూడా!

మూడు రోజులలో ఏడు ఖండాలు, 208 దేశాలు చుట్టొచ్చిన మహిళ, ఈ యాత్రతో పాత గిన్నిస్‌ రికార్డు చెరిగిపోయింది!
Follow us

|

Updated on: Nov 20, 2020 | 11:23 AM

సాహిత్య అభిమానులకు జులెస్‌ వెర్న్‌ రాసిన అరౌండ్‌ ది వరల్డ్‌ 80 డేస్‌ అనే నవల గుర్తుంటే ఉంటుంది.. ఆ అడ్వెంచరస్‌ నవలను ముళ్లపూడి వెంకటరమణ 80 రోజులలో భూ ప్రదక్షణ పేరుతో తెలుగులో అనువదించారు కూడా! ఆ రోజుల్లో అయితే గ్లోబ్‌ను చుట్టిరావడానికి 80 రోజులు పట్టింది కానీ.. ఇప్పుడైతే మూడు రోజుల్లో చుట్టేయొచ్చు.. ప్రపంచ రికార్డు సొంతం చేసుకోవచ్చు.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన డాక్టర్‌ ఖావ్లా అల్‌ రొమైతీ అనే మహిళకు ఇలాంటి రికార్డు సాధించాలన్న అభిలాష మెండుగా ఉండింది.. అతి తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుడితే బాగుంటుందని ఆమెకు అనిపించింది. అందుకోసం పకడ్బందీ ప్లాన్ వేసుకుంది.. ఫిబ్రవరి తొమ్మిదో తేదీన ప్రపంచయాత్ర మొదలు పెట్టింది.. ఫిబ్రవరి 13వ తేదీన ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం దగ్గర యాత్రను ముగించింది.. అంటే కేవలం మూడు రోజుల 14 గంటల 46 నిమిషాల, 48 సెకన్లలో ప్రపంచం మొత్తం తిరిగేసింది.. 208 దేశాలను సందర్శించింది. అతి తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుట్టివచ్చినందుకు డాక్టర్‌ ఖావ్లా ఆల్‌ రొమైతీ పేరు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. నిన్న గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు నిర్వాహకులు ఇచ్చిన సర్టిఫికెట్‌తో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.. తనకు గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డ్సు అంటే ఎంతో ఆసక్తి అని, అందుకే ప్రపంచాన్ని చుట్టేశానని ఆమె సంబరంగా చెప్పుకుంది.. గిన్నిస్‌ బుక్‌ సర్టిఫికెట్ అందుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది.. యాత్రలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కొన్ని మధురమైన సంఘటను కూడా తారసపడ్డాయని చెప్పింది. ఇంతకు ముందు ఈ రికార్డు ఇద్దరు యాత్రికులు జూలీ బెర్రీ, కాసే స్టివార్ట్‌ పేరిట ఉండింది.. వారిద్దరు ఏడు ఖండాలను 92 గంటల నాలుగు నిమిషాల 19 సెకన్లలో చుట్టేశారు.. ఇప్పుడా రికార్డు రొమైతీ కారణంగా తుడిచిపెట్టుకుపోయింది.

ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు
మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు