దక్షిణ భారత్‌‌కు ఉగ్రముప్పు… ఆర్మీ హెచ్చరిక!

Army Warns of Possible Terror Attack in South India After Boats Found Abandoned at Sir Creek, దక్షిణ భారత్‌‌కు ఉగ్రముప్పు… ఆర్మీ హెచ్చరిక!

ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌లో విధ్వంసానికి పాకిస్తాన్ కుట్ర చేస్తోంది. సరిహద్దుల్లో కాల్పులతో రెచ్చిపోతూనే.. మరోవైపు ఉగ్రవాదులను భారత్‌లోకి పంపి విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేస్తోంది. అంతర్జాతీయ సరిహద్దుతో పాటు ఎల్‌వోసీ వెంబడి ఇండియన్ ఆర్మీ భద్రతను కట్టుదిట్టం చేయడంతో దక్షిణ భారత్‌ని టెర్రరిస్టులు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భీకర దాడులకు ఉగ్రవాదులు కుట్ర చేశారని ఆర్మీ హెచ్చరించింది. పడవల్లో తీర ప్రాంతాలకు చేరుకొని దేశంలోకి ఉగ్రవాదులు ప్రవేశించవచ్చని తెలిపింది. ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాల డీజీపీలకు సమాచారం చేరవేసింది ఆర్మీ.

ఆర్మీ హెచ్చరికలతో కేరళ పోలీసులు అప్రమత్తమయ్యారు. అేన్ని జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులను అలర్ట్ చేసిన డీజీపీ.. భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులతో పాటు రద్దీ ప్రాంతాల్లో బందోబస్తు పెంచాలని సూచించారు. శ్రీలంక మీదుగా వచ్చిన ఆరుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆగస్టులో తమిళనాడులో ప్రవేశించినట్లు ఇప్పటికే నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇక తాజాగా ఆర్మీ కూడా హెచ్చరించడంతో తమిళనాడులోనూ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *