పశ్చిమ బెంగాల్.. తుపాను బాధితుల సాయం కోసం కదిలిన ఆర్మీ

ఉమ్ ఫున్ తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్..ముఖ్యంగా కోల్ కతా తీవ్రంగా దెబ్బ తినడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్మీ సాయాన్ని కోరింది. దీంతో సైన్యం వెంటనే మూడు కంపెనీల సైనిక బృందాలను ఈ నగరానికి పంపింది. ఇప్పటికే పోలీసులు, ఎన్ డీ ఆర్ ఎఫ్, ఎస్ డీ ఆర్ ఎఫ్ టీమ్ లు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. బాధితులకు ఆహారం, మంచినీరు, శానిటేషన్ తదితరాల కోసం అత్యవసరంగా మీ సేవలు కావాలని సైన్యాన్ని కోరుతూ.. రాష్ట్ర […]

పశ్చిమ బెంగాల్.. తుపాను బాధితుల సాయం కోసం కదిలిన ఆర్మీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 23, 2020 | 8:09 PM

ఉమ్ ఫున్ తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్..ముఖ్యంగా కోల్ కతా తీవ్రంగా దెబ్బ తినడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్మీ సాయాన్ని కోరింది. దీంతో సైన్యం వెంటనే మూడు కంపెనీల సైనిక బృందాలను ఈ నగరానికి పంపింది. ఇప్పటికే పోలీసులు, ఎన్ డీ ఆర్ ఎఫ్, ఎస్ డీ ఆర్ ఎఫ్ టీమ్ లు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. బాధితులకు ఆహారం, మంచినీరు, శానిటేషన్ తదితరాల కోసం అత్యవసరంగా మీ సేవలు కావాలని సైన్యాన్ని కోరుతూ.. రాష్ట్ర హోమ్ శాఖ ట్వీట్లు చేసింది. నగరంలో అనేక చోట్ల భారీ వృక్షాలు విరిగి పడి వాహనాలకు వాహనాలే దెబ్బ తిన్నాయి. సుమారు అయిదు లక్షలమంది ఇళ్ళు కోల్పోయి నిరాశ్రయులు  కాగా ప్రభుత్వం వారిని పునరావాస కేంద్రాలకు తరలించింది. ఈ తుఫాను కారణంగా లక్ష కోట్ల నష్టం వాటిల్లిందని, 72 మంది మరణించారని సీఎం మమతా బెనర్జీ ఇదివరకే ప్రకటించారు. ప్రధాని మోదీ శుక్రవారం తుపాను ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి వెయ్యి కోట్లు, ఒడిశా రాష్ట్రానికి 500 కోట్ల పరిహారాన్ని ప్రకటించారు. అటు- బాధితులను ఆదుకునేందుకు మమతా బెనర్జీ సైన్యం సాయం కోరడం పట్ల గవర్నర్ జగ దీప్ ధన్కర్ ఆమెను అభినందిస్తూ ట్వీట్లు చేశారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..